Megastar Chiranjeevi: ఆ ప్రాజెక్టులో నేనూ భాగమయ్యాను.. లాల్ సింగ్ చద్దా సినిమాపై చిరు ఆసక్తికర ట్వీట్..

హైదరాబాద్‌లోని మెగాస్టార్ చిరంజీవి నివాసంలో ఈ సినిమా ప్రత్యేక ప్రివ్యూ జరిగింది. ఈ ప్రివ్యూకి ప్రత్యేక అతిధులుగా కింగ్ నాగార్జున, అక్కినేని నాగ చైతన్య,

Megastar Chiranjeevi: ఆ ప్రాజెక్టులో నేనూ భాగమయ్యాను.. లాల్ సింగ్ చద్దా సినిమాపై చిరు ఆసక్తికర ట్వీట్..
Laal Singh Chaddha
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 16, 2022 | 11:12 AM

బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ (Amir Khan) ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం లాల్ సింగ్ చద్దా (Laal Singh Chaddha). అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కరీనా కపూర్ హీరోయిన్‏గా నటిస్తుండగా.. టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య కీలకపాత్రలో నటించారు. ఈ సినిమాకు అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. ఎన్నో అంచనాలు నెలకొన్న ఈ మూవీ ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో తన చిరకాల మిత్రుడు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కోసం అమీర్ ఖాన్ హైదరాబాద్‏ విచ్చేశారు.. చిరు ఇంట్లో లాల్ సింగ్ చద్దా ప్రివ్యూ నిర్వహించిన సంగతి తెలిసిందే.

హైదరాబాద్‌లోని మెగాస్టార్ చిరంజీవి నివాసంలో ఈ సినిమా ప్రత్యేక ప్రివ్యూ జరిగింది. ఈ ప్రివ్యూకి ప్రత్యేక అతిధులుగా కింగ్ నాగార్జున, అక్కినేని నాగ చైతన్య, స్టార్ డైరెక్టర్లు ఎస్ఎస్.రాజమౌళి, సుకుమార్ గార్లు పాల్గొన్నారు. తాజాగా లాల్ సింగ్ చద్దా సినిమా గురించి ఫస్ట్ రివ్యూ ఇచ్చేశారు మెగాస్టార్. అమీర్ ఖాన్, నాగార్జున, చైతన్య, రాజమౌళి, సుకుమార్‏తో కలిసి లాల్ సింగ్ చద్దా మూవీ గురించి చర్చించిన వీడియోను తన ట్వీట్టర్ వేదికగా షేర్ చేశారు. ” నా ప్రియమిత్రుడు అమీర్ ఖాన్ @ క్యోటో విమానాశ్రయం.. జపాన్. అతని కలల ప్రాజెక్టులో భాగమయ్యాను. మా ఇంట్లో ప్రత్యేక ప్రివ్యూ ఇచ్చినందుకు అమీర్ ఖాన్‏ను ధన్యవాదాలు.” అంటూ రాసుకొచ్చారు చిరు. అన్నింటికంటే ముఖ్యంగా మీరు తీసిన సినిమా రత్నం. ఎంతో అద్భుతమైన ఎమోషనల్ జర్నీ అంటూ చెప్పుకొచ్చారు చిరంజీవి. ఈ చిత్రాన్ని అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ‘లాల్ సింగ్ చద్దా’ ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్దమ‌యింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే