Naga Chaitanya: ఆ స్టార్ హీరోకు అభిమాని చైతూ.. ఆసక్తికర అంశం రివీల్ చేసిన నాగ చైతన్య
స్టార్ హీరోనే మరో స్టార్‌కు ఫ్యాన్స్‌గా కనిపిస్తే... ఆ హీరోల ఫ్యాన్స్‌కు పండగే. తెలుగు తెర మీద అలాంటి పండుగలు అడపాదడపా కనిపిస్తూనే ఉన్నాయి.
Naga Chaitanya: మాములుగా స్టార్ హీరో అంటే ఫ్యాన్స్ చాలా మందే ఉంటారు. అలాంటిది ఆ స్టార్ హీరోనే మరో స్టార్‌కు ఫ్యాన్స్‌గా కనిపిస్తే… ఆ హీరోల ఫ్యాన్స్‌కు పండగే. తెలుగు తెర మీద అలాంటి పండుగలు అడపాదడపా కనిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ స్టార్ ఫ్యామిలీ హీరో కూడా ఫ్యాన్ రోల్‌లో నటించారు. అది కూడా తన కాంటెంపరరీ హీరోకు అభిమానిగా నటించటం మరింత సర్‌ప్రైజింగ్‌గా అనిపించింది. వివరాల్లోకి వెళ్తే.. అక్కినేని ఫ్యామిలీ నుంచి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన హీరో నాగ చైతన్య ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. డిఫరెంట్ మూవీస్‌తో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న ఈ యంగ్ హీరో… త్వరలో థాంక్యూ మూవీ (Thank You) తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. మనం లాంటి సూపర్ హిట్ ఇచ్చిన విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు చైతూ.
ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న చైతూ ..ఆ సినిమాలో తన క్యారెక్టర్‌కు సంబంధించి ఇంట్రస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు అభిమానిగా కనిపిస్తారట నాగచైతన్య. ఇద్దరూ ఒకే జనరేషన్ హీరోలైనా… అభిమాని పాత్రకు చైతూ ఓకే చెప్పటం నిజంగానే గ్రేట్ అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.
గతంలో కూడా కొందరు హీరోలు తమ సినిమాల్లో స్టార్ ఫ్యాన్ పాత్రలను పోషించారు. నేచురల్ స్టార్ నాని అభిమాని పాత్రలో అదరగొట్టారు. కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాలో చేతి మీద జై బాలయ్య అని పచ్చబొట్టు వేయించుకునేంత హార్డ్ కోర్ ఫ్యాన్‌గా కనిపించారు . అందుకే ఈ సినిమా సక్సెస్‌కు బాలయ్య అభిమానులు కూడా హెల్ప్ అయ్యారన్న టాక్ అప్పట్లో గట్టిగా వినిపించింది.
సాహో సినిమాలో విలన్స్‌ను డైహర్డ్ ఫ్యాన్స్ అంటూ సెటైర్ వేసిన ప్రభాస్ కూడా ఓ స్టార్ హీరోకు అభిమానిగా తెర మీద అలరించారు. బుజ్జిగాడు సినిమాలో రజనీకి వీరాభిమానిగా కనిపించిన డార్లింగ్… ఏకంగా తలైవా అంటూ మాంచీ బీట్‌లో సాంగ్ అందుకున్నారు. ఇలా స్టార్ హీరోలు కూడా అభిమానులుగా మారటం ఇంట్రస్టింగ్ ట్రెండ్ అంటున్నారు విశ్లేషకులు.
మరిన్ని సినిమా వార్తలు చదవండి..