09 January 2026
క్వీన్ ఈజ్ బ్యాక్.. ఒక్కో సినిమాకు సమంత రెమ్యునరేషన్ ఎంతంటే..
Rajitha Chanti
Pic credit - Instagram
ఏమాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది సమంత. ఆ తర్వాత స్టార్ హీరోస్ అందరి సరసన నటించి స్టార్ డమ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ.
మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ అమ్మడు.. దాదాపు 15 సంవత్సరాలుగా సినీరంగంలో అనేక హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేసింది.
చివరగా ఖుషి చిత్రంతో హిట్టు అందుకుంది. ఆ తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ఇటీవల శుభం మూవీతో తిరిగి రీఎంట్రీ ఇచ్చింది.
గతేడాది మా ఇంటి బంగారం అనే సినిమాను ప్రకటించింది. శుక్రవారం విడదలైన ఈ మూవీ టీజర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది.
ఇదెలా ఉంటే.. ఈ సినిమాలో సమంత యాక్షన్ సీక్వెన్స్ ఉండనున్నాయి. చాలా కాలం తర్వాత మరోసారి ఫైట్ సీన్లలో అదరగొట్టనున్నట్లు తెలుస్తోంది.
అలాగే నివేదికల ప్రకారం సమంత ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.10 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది. అలాగే బ్రాండ్స్ ద్వారా సంపాదిస్తుంది.
సినిమాలే కాకుండా అటు యాడ్స్, బిజినెస్ రంగాల్లోనూ భారీగా సంపాదిస్తూ దూసుకుపోతుంది. మా ఇంటి బంగారం మూవీతో మల్లీ అలరించనుంది.
ఈ చిత్రానికి నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. సమంత భర్త రాజ్ నిడిమోరు కథ అందించారు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్