ప్రతి నెలా 5 వేల మంది రైడర్లను తొలగిస్తుంటాం.. జొమాటో బాస్ షాకింగ్ ప్రకటన
జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ నెలకు 5 వేల మంది గిగ్ వర్కర్ల తొలగింపుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 10 నిమిషాల డెలివరీ ఒత్తిడి, వేతనాలు, సామాజిక భద్రత లేమిపై గిగ్ వర్కర్లు సమ్మెకు దిగిన వేళ గోయల్ ప్రకటన చర్చనీయాంశమైంది. మోసాలు, ప్రమాదాలు, కార్మికుల కష్టాలపై తలెత్తిన ప్రశ్నలకు ఈ ప్రకటన మరింత ఆజ్యం పోసింది.
ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ తమ కంపెనీ నుంచి ప్రతి నెలా సుమారు 5 వేల మంది గిగ్ వర్కర్ల ను తొలగిస్తుంటామని షాకింగ్ ప్రకటన చేసారు. ఎక్కువగా ఇందులో మోసాలకు పాల్పడిన వారే ఉంటారని తెలిపారు. దీని గురించి యూట్యూబర్ రాజ్ షమానీ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడారు గోయల్. ఇంకా తాము తొలగించిన వారే కాకుండా.. అదనంగా ప్రతి నెలా సుమారుగా 1.50 లక్షల నుంచి 2 లక్షల మంది వరకు తమ ప్లాట్‌ఫాంపై పని చేసే గిగ్ వర్కర్లు స్వచ్ఛందంగా వదిలివెళుతుంటారని అన్నారు. అయితే ఈ తొలగింపు తమపై పెద్దగా ఎలాంటి ప్రభావం పడదని.. అంతే సంఖ్యలో కొత్త వారిని నియమించుకుంటుంటామని తెలిపారు. జొమాటోకే చెందిన బ్లింకిట్ సహా ఇతర క్విక్ కామర్స్ సంస్థలు 10 నిమిషాల క్విక్ డెలివరీపైనా విమర్శలు వస్తున్నాయి. ఇది గిగ్ వర్కర్లపై ఒత్తిడి పెంచుతోందని.. ప్రమాదాలకు కారణమవుతుందని ఆరోపణలు వచ్చాయి. అయితే దీనిపైనా గోయల్ స్పందించారు. కస్టమర్లకు 2 కిలోమీటర్లలోపే తమ అవుట్ లెట్స్ ఉంటున్నాయని.. అక్కడ 2 నిమిషాల్లో ప్యాకింగ్ రెడీ అయినా.. మిగతా 8 నిమిషాల్లో కేవలం గంటకు సగటున 15 కిలోమీటర్ల వేగంతోనే డెలివరీ పార్ట్‌నర్స్ వెళ్తున్నారని వివరణ ఇచ్చారు. తమ సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ జనవరి 1న గిగ్ వర్కర్లు 6 గంటల సమ్మెకు దిగారు. చాలా కంపెనీలు పనికి తగ్గట్లుగా వేతనాలు చెల్లించట్లేదని.. సరైన సామాజిక భద్రత ఇవ్వడం లేదంటూ గిగ్ వర్కర్లు ఆరోపిస్తున్నారు. వారి వేతనాలు, సామాజిక భద్రత, 10 నిమిషాల డెలివరీ వంటి వాటి మధ్య వాదన జరుగుతోంది. సరిగ్గా ఈ సమయంలో జొమాటో బాస్ దీపిందర్ గోయల్ సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చకు దారి తీసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తెలంగాణ విద్యార్థులు ఊపిరి పీల్చుకోండి.. సంక్రాంతి సెలవలు వచ్చేశాయి.. ఎన్ని రోజులంటే
సంక్రాంతికని సొంతూరుకు వచ్చినవారిని.. వెంటాడిన మృత్యువు
గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. ఆ పని చేయలేదా.. ఈ ఆఫర్ పొందలేరు
ట్రైన్ ఎక్కి యువకుడు రచ్చ రచ్చ… కట్ చేస్తే చెక్కేసిన పోలీసులు! వీడియో వైరల్
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్‌లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే
రూ.4 చోరీ కేసులో.. 51 ఏళ్లకు తీర్పు
మంచు సునామీ..ఎప్పుడైనా చూశారా..! షాకింగ్ వీడియో
ఆ పరుశురాముడికే మార్గదర్శనం చేసిన ఏకా తాతయ్య గురించి మీకు తెలుసా

