AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లండన్‌ రైల్లో సమోసాలు అమ్మిన బీహారీ.. పరువు తీశావంటూ ట్రోలింగ్

లండన్‌ రైల్లో సమోసాలు అమ్మిన బీహారీ.. పరువు తీశావంటూ ట్రోలింగ్

Phani CH
|

Updated on: Jan 09, 2026 | 9:35 AM

Share

సమోసా: భారత రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల ఆకలి తీర్చే ఈ అల్పాహారం ఇటీవల వార్తల్లో నిలిచింది. ఓ రైల్వే స్టేషన్‌లో సమోసాలు అమ్ముకుంటున్న వృద్ధురాలికి భారత సైనికులు సాయం చేయగా, లండన్ ట్యూబ్ ట్రైన్‌లో సమోసాలు అమ్ముతున్న రెస్టారెంట్ యజమాని వీడియో వైరల్ అయ్యింది. ఇది దేశ పరువుపై చర్చకు దారితీసింది, మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి.

మన రైళ్లలో ఎక్కువగా వినిపించే పదం సమోసా. రైల్వేస్టేషన్‌లో కొందరు పొట్టకూటి కోసం సమోసాలు అమ్ముతుంటారు. సమోసాలు అమ్ముతున్న ఓ బామ్మకు సాయం చేసారు భారత సైనికుల బృందం. స్టేషన్‌లో ఓ వృద్ధురాలు సమోసాలు అమ్మడం సైనికుల కంట పడింది. ఇంట్లో వాళ్లకి సమోసాల రుచి చూపిస్తామంటూ బుట్టలో ఉన్న అన్నిటినీ ఉన్నపళంగా కొనేసారు. ఊహించని ఈ పరిణామానికి బామ్మ ఆశ్చర్యపోయింది. చిన్న కవర్లలో సమోసాలను ప్యాక్‌ చేసి ఇచ్చిన బామ్మకు సైనికులు కృతజ్ఞతలు తెలిపారు. గరం గరం వేడి వేడి సమోసే అన్న పిలుపు లండన్ రైల్లో కూడా వినిపించింది. ఓ వ్యక్తి భారత సంప్రదాయ దుస్తుల్లో సమోసాలు అమ్ముకుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇండియా పరువు తీశావంటూ ట్రోలింగ్ మొదలైంది. మిక్స్డ్ రియాక్షన్స్ తో నెట్టింట డిబేట్ నడుస్తోంది. అయితే లండన్‌లో సమోసాలు అమ్మింది మూమూలు వ్యక్తేం కాదు. సేల్స్ బాయ్ అసలే కాదు. లండన్ లోని ఘంటావాలా రెస్టారెంట్ ఓనర్. ఓ అండర్ గ్రౌండ్ ట్యూబ్ స్టేషన్ లో సమోసాలు అమ్ముతూ సందడి చేశారు. ఇక నుంచి ఇక్కడి స్థానికులు క్రాయిసెంట్స్ తినాల్సిన పనిలేదు.. వాళ్లు బిహారీ సమోసాలు తింటారు అంటూ వీడియో పోస్ట్‌ చేసారు. తన హోటల్ కిచెన్ లో సమోసాలు తయారు చేసుకుని ట్రైన్ లోకి తీసుకెళ్లి ప్యాసెంజర్స్ కు అమ్మారు. వేడివేడి సమోసాలకు తోడు పుదీనా చట్నీ అమ్ముతూ అందరినీ ఆకర్షించాడు. తన రెస్టారెంట్ ను ప్రమోట్ చేసుకునేందుకే రైళ్లలో సమోసాలు అమ్ముతూ వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఓనర్. హోటల్ ఓనర్ సమోసాలు అమ్మడంపై కొందరు సోషల్ మీడియాలో అసహనం ప్రదర్శించారు. నీ అమ్మకాల కోసం ఇండియా పరువు తీయకు బ్రో అని కామెంట్ చేశారు. చూడటానికి దరిద్రంగా ఉంది.. అది రియల్ కాదు ఏఐ అని చెప్పండి ..నా మనసు శాంతిస్తుంది అని మరొకరు రిప్లై ఇచ్చారు. కొందరు సమోసా ప్రియులు పాజిటివ్ గా రిప్లై ఇచ్చారు. దుబాయిలో కూడా ట్రై చేయొచ్చుకదా అని ఒకరంటే.. రివర్స్ వలసవాదం అంటూ మరొకరు జోక్ చేశారు. ఒక వేల క్రాయిసెంట్స్ ను సమోసాలు రీప్లేస్ చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి అంటూ మరొకరు ఆశావాద కోణంలో కామెంట్‌ పెట్టారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తెలంగాణ విద్యార్థులు ఊపిరి పీల్చుకోండి.. సంక్రాంతి సెలవలు వచ్చేశాయి.. ఎన్ని రోజులంటే

సంక్రాంతికని సొంతూరుకు వచ్చినవారిని.. వెంటాడిన మృత్యువు

గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. ఆ పని చేయలేదా.. ఈ ఆఫర్ పొందలేరు

ట్రైన్ ఎక్కి యువకుడు రచ్చ రచ్చ… కట్ చేస్తే చెక్కేసిన పోలీసులు! వీడియో వైరల్

తల్లికి ఉన్న రూ.12 లక్షల అప్పును తీర్చిన టీనేజ్‌ కొడుకు