ఈ అమ్మాయికి యాక్టింగ్ రాదు, ఎందుకు పెట్టుకున్నారు అని ఆ స్టార్ హీరో డైరెక్టర్‌కి చెప్పాడు..
తెలుగు ప్రేక్షకులకు హరితేజ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సీరీయల్స్ ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈమె .. పలు టీవీషోలో కనిపించి మెప్పించింది. అలాగే సినిమాలతో పాటు తెలుగు బిగ్ బాస్ గేమ్ షోలోనూ కనిపించి ఆకట్టుకుంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అఆ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది నటి హరితేజ. ఈ సినిమాలో తన నటనతో అలరించి మెప్పించింది. ఆతర్వాత వరుసగా సినిమాల్లో నటించి అలరించింది. చాలా సినిమాల్లో కీలక పాత్రల్లో మెప్పించింది హరితేజ. అలాగే బిగ్ బాస్ సీజన్ 1లో పాల్గొంది ఈ నటి. బిగ్ బాస్ తర్వాత హరితేజ క్రేజ్ మరింత పెరిగింది. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. తాజాగా ఓ ఇంటర్యూలో పాల్గొన్న హరితేజ ఆసక్తికర విషయాలను పంచుకుంది.
మహేష్, పవన్ కళ్యాణ్ అలా.. ప్రభాస్ ఇలా..! స్టార్ హీరోల గురించి ప్రభాస్ శ్రీను ఏమన్నారంటే
ఇక దేవర సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్‌తో కలిసి పనిచేసిన అనుభవం మాట్లాడుతూ.. ఆమెను చూసినప్పుడు శ్రీదేవి గారిని చూసినట్టే అనిపించిందని తెలిపింది. జాన్వి కపూర్ తెలుగు డైలాగ్స్‌ను సులువుగా చెప్పింది. తెలుగు ఆమె నేర్చుకున్న విధానం సూపర్. జూనియర్ ఎన్టీఆర్‌తో తనకున్న సరదా ఆటపట్టింపులు, చిట్టపట్లు గురించి హరి తేజ పంచుకున్నారు. అరవింద సమేత సినిమా సమయంలోనూ, ఆతర్వాత దేవర చిత్రీకరణలోనూ ఎన్టీఆర్ తనను తరచూ ఆటపట్టిస్తుంటారని తెలిపారు. శివ కొరటాల గారిని పిలిచి “ఈ అమ్మాయికి యాక్టింగ్ రాదు, ఎందుకు పెట్టుకున్నారు సార్?” అని ఎన్టీఆర్ అడిగేవారు అని తెలిపింది హరితేజ. ఇప్పటికీ ఆయన అలానే ఏడిపిస్తూ ఉంటారని చెప్పారు హరితేజ. అది కేవలం ఫన్ కోసమేనని వివరించారు.
ఆ టైంలో చనిపోతా అనుకున్నా.. ఆయనే సాయం చేశారు.. ఎమోష్నలైన పోసాని
అలాగే దేవర సినిమాలో బోట్‌లో వచ్చే డైలాగ్‌ను తన మర్చిపోలేని స్వీట్ మెమొరీగా పేర్కొన్నారు హరితేజ. అలాగే తనకు అఆ తనకు ఎలా వచ్చిందో హరి తేజ తెలిపారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక కుకరీ షోలో తన కామెడీని, జోకులను చూసి ఈ పాత్రకు ఎంపిక చేశారని తెలిపారు. మొదట త్రివిక్రమ్ సినిమాలో అవకాశం అనగానే ఆశ్చర్యపోయానని, ఆడిషన్ ఇచ్చి వారం, పది రోజులు కాల్ రాకపోవడంతో అవకాశం పోయిందని భావించానని చెప్పారు. అయితే, ఆ తర్వాత నేరుగా డేట్స్ వచ్చాయని, మూడు నెలల పాటు షూటింగ్‌లో పాల్గొన్నానని తెలిపారు. ఆ పాత్ర ఎంత పెద్దదో, ఎంత కీలకమో తనకు మొదట తెలియదని, సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత.. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టేజ్ మీద అందరి ముందు తనను “యంగ్ సూర్యకాంతం” అని ప్రశంసించారని హరి తేజ తెలిపారు. అది తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకమని, తన కెరీర్‌లో అప్పుడే ఎదుగుతున్న సమయంలో లభించిన గొప్ప గుర్తింపు అని హరి తేజ చెప్పుకొచ్చింది.
ఒకే రోజు పెళ్లి చేసుకున్న ప్రాణస్నేహితులు.. తెలుగులో ఇద్దరూ తోపులే.. వాళ్లు ఎవరంటే
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.




