అందంలో శ్రీదేవికే పోటీ ఇచ్చింది.. నటనలో మహానటికి తీసిపోదు.. కానీ 30ఏళ్లకే కన్నుమూసింది
సినిమా ఇండస్ట్రీలో ఎంత మంది స్టార్ హీరోయిన్స్ ఎప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంటారు. అలాంటి వారిలో శ్రీదేవి ఒకరు. అతిలోకసుందరి అనే పదానికి ఆమె నిలువెత్తు నిదర్శనం ఆమె.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది శ్రీదేవి .

ఒకానొక దశలో సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మ శ్రీదేవి. ఆమె అందానికి, నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. ఎంతో మంది స్టార్ హీరోలతో నటించి మెప్పించారు. ఆమె లేని బాధను అభిమానులు ఇప్పటికీ అనుభవిస్తున్నారు. శ్రీదేవి మరణం ఇప్పటికీ చాలామందిని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. 1992 నుంచి 1997 వరకు ఆమె అన్ని భాషలలోని స్టార్ హీరోలతో కలిసి నటించింది. బాలనటిగా కెరీర్ స్టార్ట్ చేసిన శ్రీదేవి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా సత్తా చాటింది. అప్పట్లో మొదటిసారి కోటి పారితోషికం తీసుకునే కథానాయికగా చరిత్ర సృష్టించింది శ్రీదేవి. అయితే శ్రీదేవితో అందంతో నటనతో పోటీపడ్డ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.?
మహేష్, పవన్ కళ్యాణ్ అలా.. ప్రభాస్ ఇలా..! స్టార్ హీరోల గురించి ప్రభాస్ శ్రీను ఏమన్నారంటే
అవును శ్రీదేవితో అందంతో పాటు నటనతో మెప్పించింది ఆమె.. స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలోనే ఊహించని విధంగా కన్నుమూసింది. ఆమె ఎవరో తెలుసా.. ఆమె మరెవరో కాదు టాలీవుడ్ అందాల తార సౌందర్య . ఒకప్పుడు ఇండస్ట్రీని శాసించిన హీరోయిన్. అద్భుతమైన నటన.. సహజ నటనతో కోట్లాది మంది అభిమానుల మనసులు గెలుచుకుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించింది. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీని ఏలిన హీరోయిన్.
ఆ టైంలో చనిపోతా అనుకున్నా.. ఆయనే సాయం చేశారు.. ఎమోష్నలైన పోసాని
గ్లామర్ షోకు దూరంగా ఉంటూ సంప్రదాయ పద్దతిలోనే కనిపిస్తూ.. కేవలం నటనతోనే నంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగింది. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున, రజినీకాంత్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వంటి స్టార్ హీరోలతో నటించి స్టార్ డమ్ సంపాదించుకుంది. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే అనుహ్యంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లి పోయింది. ఓ హెలికాఫ్టర్ ప్రమాదంలో సౌందర్య చనిపోయారు. ఆమె బ్రతికి ఉంటే ఇప్పటికీ ఆమె నెంబర్ వన్ హీరోయిన్ గా ఉండే వారు అని అభిమానులు అంటున్నారు.
ఒకే రోజు పెళ్లి చేసుకున్న ప్రాణస్నేహితులు.. తెలుగులో ఇద్దరూ తోపులే.. వాళ్లు ఎవరంటే
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.




