Brahmamudi, September 17th Episode: రఫ్ఫాడించేసిన అపర్ణ.. కాళ్ల బేరానికి రాజ్.. ఇంటికి రానన్న కావ్య!

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కావ్య ఆత్మాభిమానం దెబ్బ తిని ఇంట్లోంచి వెళ్లిపోయిందని స్వప్న అపర్ణతో అంటుంది. దీంతో ఒక్కసారిగా కూలపడిపోయినట్లు అవుతుంది అపర్ణ. కావ్య మంచి పని చేసింది. కావ్య గురించి మీరందరూ ఏం అనుకుంటున్నారు. పేద ఇంటి నుంచి వచ్చింది.. సొంత వ్యక్తిత్వం లేదు అనుకుంటున్నారా.. ఎవరు ఏం అన్నా పడ్డ కావ్యా.. భర్త మనసులో స్థానం లేదని చెప్తే.. నువ్వెంత.. నీ లెక్క ఎంత.. అని పౌరుషంతో వెళ్లిపోయిందని అపర్ణ అంటుంది. అది అహంకారంతో వెళ్లిపోయింది..

Brahmamudi, September 17th Episode: రఫ్ఫాడించేసిన అపర్ణ.. కాళ్ల బేరానికి రాజ్.. ఇంటికి రానన్న కావ్య!
BrahmamudiImage Credit source: disney hotstar
Follow us
Chinni Enni

|

Updated on: Sep 17, 2024 | 12:45 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కావ్య ఆత్మాభిమానం దెబ్బ తిని ఇంట్లోంచి వెళ్లిపోయిందని స్వప్న అపర్ణతో అంటుంది. దీంతో ఒక్కసారిగా కూలపడిపోయినట్లు అవుతుంది అపర్ణ. కావ్య మంచి పని చేసింది. కావ్య గురించి మీరందరూ ఏం అనుకుంటున్నారు. పేద ఇంటి నుంచి వచ్చింది.. సొంత వ్యక్తిత్వం లేదు అనుకుంటున్నారా.. ఎవరు ఏం అన్నా పడ్డ కావ్యా.. భర్త మనసులో స్థానం లేదని చెప్తే.. నువ్వెంత.. నీ లెక్క ఎంత.. అని పౌరుషంతో వెళ్లిపోయిందని అపర్ణ అంటుంది. అది అహంకారంతో వెళ్లిపోయింది.. అప్పటికీ మా అమ్మ రాజ్‌ని క్షమాపణ అడగమని చెప్పినా పట్టించుకోకుండా వెళ్లిపోయింది. శభాష్.. దటీజ్ కావ్య.. ఏం చేసింది అత్తయ్యా.. నా కోడలు? మీరెందుకు క్షమాపణ చెప్పమన్నారు? అది ఈ ఇంటి పరువు, ప్రతిష్టలు నిలబెట్టడానికి వెళ్లింది. అది మీరు అనాల్సిన మాటేనా? అని అపర్ణ నిలదీస్తుంది.

తప్పు అంతా నా కొడుకుదే..

నిజమే అపర్ణా.. కానీ వీడు తెగే దాకా లాగుతున్నాడు. ఆ రుద్రాణి అగ్నికి ఆజ్యం పోస్తుంది. కావ్య అన్నమాట మీదే నిలబడింది. ఇదంతా ఎక్కడికి దారి తీస్తుందోనని చెప్పమన్నాను అని ఇందిరా దేవి అంటుంది. కావ్య మీ పెద్ద కోడలు కాదు అత్తయ్యా.. నా కోడలు. నేనంటే మీ కొడుకు చేసిన ద్రోహాన్ని దిగమింగి.. రాజీ పడి బ్రతుకుతున్నా.. దానికేం ఖర్మ. నీతిగా నిజాయితీగా బ్రతికే నా కోడలు.. రాజీ పడి క్షమించడం అడగటం ఏంటి? ఒక వేళ అది క్షమాపణ అడిగి ఉంటే.. నేనే దాని చెంప పగలకొట్టేదాన్ని. కంపెనీ నుంచి ఎలాంటి ఫోన్ లేదు. రాహుల్‌ని ఆఫీస్‌ నుంచి వెళ్లకుండా చేయడం కోసమే ఇదంతా చేసిందని రుద్రాణి అంటుంది. రాహుల ఆనాడే ఆఫీస్‌కి వెళ్లనని ఇంట్లోనే ఉంటున్నాడు కదా.. మళ్లీ కొత్తగా కావ్య ఇంకేం చేస్తుంది? ఒక గడ్డి పోచ గురించి మహా వృక్షాన్నే కూలదోసి వెళ్లిపోయింది అనుకున్నారా? నా కోడలు.. అసలు తప్పు నీది కాదు.. చెప్పుడు మాటలు విని భార్యని ఇంట్లోంచి పంపించేయడమే నా కొడుకు తప్పు. కావ్యని నువ్వు ఏం అన్నావు.. బలవంతంగా కాపురం చేశావా అంటే నిజంగానే దానిమీద ప్రేమ లేదా? అని అపర్ణ అడుగుతుంది.

నేను కావ్యని తీసుకురాను..

కావ్య నన్ను నిర్లక్ష్యం చేసి ఇలా వెళ్లడమే కదా నీ కోపం.. ఆ కోపాన్ని మాత్రమే చూపించాల్సింది. కావ్య మనసుకు గాయమై పంపించేశావు కదా.. గుండె నిండా ప్రేమను నింపుకుని.. లేదని చెప్తే ఆ పిచ్చిది ఏం అయిపోవాలి? కావాలనే దాన్ని వెళ్లగొట్టావని అపర్ణ అంటుంది. నేను వెళ్లమని చెప్పలేదు మమ్మీ అని రాజ్ అంటాడు. నా కోసమే కదా ఇదంతా చేశావు.. నా కోడలు నిప్పు.. వెళ్లి క్షమాపణ అడిగి ఇంటికి తీసుకురమ్మని అపర్ణ అంటే.. మమ్మీ నీకు నీ కోడలు ముఖ్యం అయితే.. నాకు నా తల్లే ముఖ్యం. కారణం ఏదైనా కానీ.. నిన్ను అలా వదిలి వెళ్లడం కరెక్ట్ కాదు. ఇది తప్పు.. నేను వెళ్లి పిలిచే సమస్యే లేదు. నేను వెళ్లి రమ్మని చెప్పను అని రాజ్ అనేసి వెళ్తాడు. మంచిది నేనే వెళ్తానని అపర్ణ బయలు దేరబోతే.. సీతారామయ్య ఆపుతాడు. నేనూ మీ అత్తయ్య వెళ్లి కావ్యని ఒప్పించి తీసుకొస్తామని చెప్తాడు.

ఇవి కూడా చదవండి

మేము తీసుకొస్తాం..

మీరంతా నా కోడలు గడప దాటి వెళ్తుంటే ఏం చేశారు? నాకు అందరి మీద నమ్మకం పోయిందని నిలదీస్తుంది. క్షమించండి.. నాకు ఎవరి మీద నమ్మకం లేదు.. నేనే వెళ్లి నా కోడల్ని తీసుకొస్తానని అపర్ణ అంటే.. అప్పుడే ఇందిరా దేవి ఆపుతుంది. అత్తగా నేను చెబుతున్నా.. మేము తీసుకొస్తాం.. నువ్వు వెళ్లు అని నచ్చచెప్తుంది. కావ్య మళ్లీ ఇంటికి తీసుకొస్తే ఎలా.. మనం ఇంత పడిన కష్టం వేస్టా అని రాహుల్ కంగారు పడతాడు. రేయ్ దానికి ఆత్మాభిమానం ఎక్కువ. అది రాదని రుద్రాణి అంటుంది. ఇక తెల్లవారుతుంది. కనకం ఇంటికి.. సీతా రామయ్య, ఇందిరా దేవిలు వెళ్తారు. వాళ్లను చూసి కనకం షాక్ అయి.. కంగారు పడి.. కావ్యని, కృష్ణమూర్తిని పిలుస్తుంది. అమ్మమ్మా.. రండి మీరేంటి ఇలా? అని వచ్చి ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. అత్తయ్య గారికి ఎలా ఉందని కావ్య అడిగితే.. తను కోమాలో నుంచి బయటకు వచ్చిందని.. నా కోడలు ఎక్కడ అని అడుగుతూనే ఉంది.

నేను ఇంటికి రాను..

మా మనవడు తప్పు చేశాడు. నీ మనసును గాయం చేశాడు.. నువ్వు నా మనవడిని క్షమించి ఇంటికి రావాలని సీతా రామయ్య అంటాడు. ఆ తర్వాత ఇందిరా దేవి కూడా కావ్యకి చాలా నచ్చజెప్తుంది. నాకు ఆ ఇంటికి రావడం ఇష్టమే.. కానీ ఏ హోదాలో రమ్మంటారు? ఆ ఇంట్లో నా స్థానం ఏంటి? నా భర్త మనసులో స్థానం లేదని తెలిసాక కూడా నేను అక్కడికి వస్తే.. నా స్థానం ఏంటి చెప్పండి. నేను ఆయనకు భార్యగా ఉండలేను. నాకు పెళ్లైన దగ్గర నుంచి ఇప్పటికీ ఆయన ఒకే మాట మీద ఉన్నారు. ఇక నేను అక్కడికి వచ్చి సాధించేది ఏముంది? అని కావ్య నిలదీస్తుంది. బాధతో అక్కడి నుంచి వెళ్లిపోతారు పెద్దాయన, పెద్దావిడ. మరోవైపు కావ్య వస్తుందా.. లేదా.. అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..