Bigg Boss 8 Telugu Promo: అతడు హగ్ చేసుకుంటే కంఫర్టబుల్గా లేదు.. ఏడ్చేసిన యష్మీ.. ప్రోమో చూశారా..?
అయితే మణికంఠ చెప్పిన రీజన్స్ అన్నింటికి యష్మి డిఫైండ్ చేసుకుంది.. ఈ క్రమంలోనే కొన్ని సందర్భాల్లో మాటలు నోరు జారేసింది. ఇద్దరి మధ్య బిగ్ ఫైట్ నడిచింది. ఈ సీజన్ లో తాను ఉన్నన్ని రోజులు మణికంఠను నామినేట్ చేస్తూనే ఉంటా అంటూ ఛాలెంజ్ చేసింది. ఫ్రెండ్షిప్ పేరుతో తనను మోసం చేశాడని.. తన హార్ట్ బ్రేక్ చేశాడంటూ చెప్పుకొచ్చింది.
బిగ్‍బాస్ మూడో వారం నామినేషన్స్ ప్రక్రియ నిన్నటితో ముగిసింది. ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్లేందుకు ప్రేరణ, యష్మి, మణికంఠ, విష్ణుప్రియ, సీత, నైనిక, పృథ్వీ, అభయ్ నామినేట్ అయ్యారు. నామినేషన్స్ సమయంలో ఒక్కొక్కరి మధ్య ఓ రేంజ్ డైలాగ్ వార్ జరిగిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా మణికంఠ, యష్మి మధ్య హీటెక్కించే డిస్కషన్ నడిచింది. గత రెండు వారాలుగా చీఫ్ పోస్టులో ఉన్న యష్మీ మొదటిసారి నామినేషన్స్ లోకి వచ్చింది. దీంతో అందరూ కంటెస్టెంట్స్ యష్మిని నామినేట్ చేశారు. అయితే మణికంఠ చెప్పిన రీజన్స్ అన్నింటికి యష్మి డిఫైండ్ చేసుకుంది.. ఈ క్రమంలోనే కొన్ని సందర్భాల్లో మాటలు నోరు జారేసింది. ఇద్దరి మధ్య బిగ్ ఫైట్ నడిచింది. ఈ సీజన్ లో తాను ఉన్నన్ని రోజులు మణికంఠను నామినేట్ చేస్తూనే ఉంటా అంటూ ఛాలెంజ్ చేసింది. ఫ్రెండ్షిప్ పేరుతో తనను మోసం చేశాడని.. తన హార్ట్ బ్రేక్ చేశాడంటూ చెప్పుకొచ్చింది.
అయితే హౌస్ లో ఫ్రెండ్ షిప్, గేమ్ రూల్స్ వేరు వేరుగా ఉంటాయని.. రెండింటిని కలిపి చూడొద్దంటూ నామినేషన్స్ లో చెప్పాడు మణికంఠ. కానీ యష్మి అతడి మాటలను పట్టించుకోలేదు. అయితే తాజాగా విడుదలైన ప్రోమోలో యష్మితో ఫ్రెండ్ షిప్ కంటిన్యూ చేసేందుకు ట్రై చేస్తున్నాడు మణికంఠ. యష్మి అద్దం ముందు హ్యాండ్ వాష్ చేస్తుండగా.. వెనక నుంచి హగ్ చేసుకున్నాడు. నామినేషన్స్ గొడవ అక్కడే వదిలేయాలని రిక్వెస్ట్ చేస్తుంటాడు. అయితే యష్మి కాస్త అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతూ వదిలేయాలని చెబుతుంది. దీంతో యష్మిని వదిలేసి మణికంఠ వెళ్లిపోతాడు. నాకు చాలా బాధగా ఉంది బిగ్ బాస్ అంటూ బెడ్ పై కన్నీళ్లు పెట్టుకుంది యష్మి.
ఆ తర్వాత సోఫాలో పృథ్వీతో మాట్లాడుతూ.. నాకు మెంటల్ టార్చర్ అది.. అతడు హగ్ చేసుకుంటే కంఫర్టబుల్ గా లేదు.. నేను ఉన్న రోజులు అతడిని నామినేట్ చేస్తుంటాను అంటూ చెప్పుకొచ్చింది. ఇక అనంతరం ఈవారం రేషన్ గెలుచుకోవడానికి ఫోటో పెట్టి ఆగేటట్టు టాస్క్ ఇచ్చాడు. అభయ్ టీమ్ నుంచి నబీల్, నిఖిల్ టీమ్ నుంచి పృథ్వీ ఈ టాస్కులో పోటీపడ్డారు.
ప్రోమో ఇదిగో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.