Tasty Teja: వేలంలో 25 కేజీల గణపతి లడ్డూను దక్కించుకున్న బిగ్ బాస్ టేస్టీ తేజా.. ఎంతకో తెలుసా? వీడియో చూడండి

మజ్ఞనాలకు ముందు వినాయకుని లడ్డూ వేలం పాటలకు ఎంతో ప్రాధాన్యముంది. సామాన్యుల మొదలు సెలబ్రిటీల వరకు గణపతి లడ్డూలను దక్కించుకునేందుకు పోటీ పడుతుంటారు. ఇందుకోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టేందుకు రెడీ అవుతుంటారు. అలా తాజాగా బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, ప్రముఖ యూట్యూబర్ టేస్టీ తేజా వినాయకుడి లడ్డూని భారీ ధరకు దక్కించుకున్నాడు

Tasty Teja: వేలంలో 25 కేజీల గణపతి లడ్డూను దక్కించుకున్న బిగ్ బాస్ టేస్టీ తేజా.. ఎంతకో తెలుసా? వీడియో చూడండి
Tasty Teja
Follow us
Basha Shek

|

Updated on: Sep 17, 2024 | 10:45 AM

దేశవ్యాప్తంగా వినాయన నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ఇన్ని రోజుల పాటు మండపాల్లో పూజలందుకున్న గణ నాథులు గంగమ్మ ఒడికి చేరుతున్నారు. ఇక మంగళవారం (సెప్టెంబర్ 17) హైదరాబాద్ లో శోభాయాత్ర అట్టహాసంగా జరుగుతోంది. ఇక నిమజ్ఞనాలకు ముందు వినాయకుని లడ్డూ వేలం పాటలకు ఎంతో ప్రాధాన్యముంది. సామాన్యుల మొదలు సెలబ్రిటీల వరకు గణపతి లడ్డూలను దక్కించుకునేందుకు పోటీ పడుతుంటారు. ఇందుకోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టేందుకు రెడీ అవుతుంటారు. అలా తాజాగా బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, ప్రముఖ యూట్యూబర్ టేస్టీ తేజా వినాయకుడి లడ్డూని భారీ ధరకు దక్కించుకున్నాడు. తన సొంత ఊరు గుంటూరు సమీపంలోని తెనాలిలో జరిగిన గణేష్ నిమజ్జనంలో ఉత్సాహంగా పాల్గొన్నాడు టేస్టీ తేజా. అలాగే చాలా మందితో పోటీ పడి సుమారు 25 కేజీల గణపతి లడ్డూని రూ. 75 వేలకు సొంతం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసుకున్నాడీ బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్. ‘ మా ఊరిలో గత 25 ఏళ్లుగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది 25వ ఏట కావడంతో 25 కేజీల భారీ లడ్డూని వినాయకుడికి సమర్పించారు. ఇప్పుడు ఈ లడ్డూని వేలం పాటలో రూ.75 వేలకు దక్కించుకున్నాను’ అని చెప్పుకొచ్చాడు టేస్టీ తేజా.

వినాయకుడి లడ్డూని వేలంలో దక్కించుకుని ఆ తర్వాత ఊరేగింపుగా ఇంటికి తీసుకుని వెళ్లాడు టేస్టీ తేజా. ఇక గణేష్ నిమజ్జన కార్యక్రమంలోనూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నాడీ ఫేమస్ యూట్యూబర్. గ్రామస్తులతో కలిసి ఎంతో హుషారుగా డ్యాన్సులు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. యూట్యూబ్‌లో ఫుడ్ వీడియోలతో పాపులర్ అయిన టేస్టీ తేజా జబర్దస్త్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లోనూ కంటెస్టెంట్ గా అడుగు పెట్టి బుల్లితెర ఆడియెన్స్ ను అలరించాడు. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లోనూ టేస్జీ తేజా వైల్డ్ కార్డ్ తో ఎంట్రీ ఇవ్వనున్నాడని ప్రచారం జరుగుతోంది. తేజతో పాటు ముక్కు అవినాష్, జబర్దస్త్ రోహిణి, హరితేజ బిగ్ బాస్ 8 హౌస్‌లోకి వెళ్లనున్నారని వార్తలు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

గణపతి లడ్డూతో బిగ్ బాస్ ఫేమ్ టేస్టీ తేజా.. వీడియో ఇదిగో..

Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి

Tasty Teja (@tastyteja) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది

వినాయక చవితి ఉత్సవాల్లో టేస్టీ తేజా.. వీడియో

Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి

Tasty Teja (@tastyteja) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.