AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Razakar: రజాకార్ సినిమాను తప్పకుండా చూడాలన్న బండి సంజయ్.. ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోందంటే?

తెలంగాణ చరిత్రలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన చిత్రం రజాకార్. యాటా సత్యనారాయణ తెరకెక్కించిన ఈ సినిమాలో అన‌సూయ‌, ఇంద్ర‌జ‌, బాబీ సింహా, వేదిక‌, ప్రేమ‌, మ‌క‌రంద్ దేశ్ పాండే, రాజ్ అర్జున్‌, తేజ్ స‌ప్రు, జాన్ విజ‌య్‌, దేవీ ప్ర‌సాద్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

Razakar: రజాకార్ సినిమాను తప్పకుండా చూడాలన్న బండి సంజయ్.. ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోందంటే?
Bandi Sanjay
Basha Shek
|

Updated on: Jan 24, 2025 | 11:11 AM

Share

తెలంగాణ సాయిధ పోరాటంలో అమ‌రులైన యోధుల కథతో తెరకెక్కిన చిత్రం రజాకార్. అప్పటి ర‌జాక‌ర్ల దురాగ‌తాలను అణచివేసి హైద‌రాబాద్‌ను ఇండియాలో విలీనం చేసేందుకు ప‌టేల్ చేసిన ప్ర‌య‌త్నాలను ఈ మూవీలో చూపించారు. గతేడాది మార్చి 15న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పర్వాలేదనిపించింది. అదే సమయంలో ఈ సినిమా ఎన్నో వివాదాలు ఎదుర్కొంది. కొన్ని రాజకీయ పార్టీలు రజకార్ సినిమాకు అనుకూలంగా మాట్లాడితే మరికొన్నిపొలిటికల్ పార్టీలు ఈ మూవీపై మండిపడ్డాయి. ఇలా ఎన్నో వివాదాలు ఎదుర్కొన్న రజకార్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో విడుదలైన సుమారు 9 నెలల తర్వాత ఈ కాంట్రవర్సీ మూవీ ఓటీటీలోకి రావడం విశేషం. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో రజాకార్ సినిమాపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కురిపించారు. అందరూ తప్పకుండా ఈ సినిమాను చూడాలని కోరారు.

‘కాలం దాచిన తెలంగాణ విముక్తి పోరాటాన్ని, మన తెలంగాణ పోరాట యోధుల చరిత్రను అత్యద్భుతంగా తెరకెక్కించిన సినిమా ఇది.రజాకార్ల దురాగతాలను ఎదురించడానికి ప్రజలే సాయుధులై కదన రంగం లో దిగిన యదార్థ కథ ఇది. చరిత్ర పుటల్లో దాగిన ఈ నెత్తురు జీవితాలను కళ్ళకు కట్టినట్లు చూపిన సినిమా రజాకార్. నిజాం హయాంలో జరిగిన మారణహోమాన్ని, హిందువులపై జరిగిన దౌర్జన్యాలను, బలవంతపు మత మార్పిడులను అడ్డుకునేందుకు ప్రజలే సాయుధులై ఎలా పోరాటం చేశారో ఈ రజాకార్ సినిమాలో చూపించారు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను నేటి తరానికి అందించాలనే ఉద్దేశంతో అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చి, ఆర్థిక నష్టాలు ఎదురైనా భయపడకుండా గూడూరు నారాయణ రెడ్డి గారు నిర్మించిన గొప్ప సినిమా రజాకార్ సినిమా శుక్రవారం ( జనవరి 24 ) నుంచి OTT వేదికగా ఆహా యాప్ లో ప్రసారమవుతోంది. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలని కోరుతున్నా. ముఖ్యంగా ప్రతీ హిందువు తప్పకుండా ఈ మూవీ చూడాలని కోరుతున్నా’ అని బండి సంజయ్ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

రజాకార్ సినిమా గురించి బండి సంజయ్ మాటల్లో.. వీడియో

 ఆహాలో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్