AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: రెండోసారి తల్లికాబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. నగ్నంగా బేబీ బంప్ ఫొటోషూట్‌తో..

టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో తాను తల్లిగా ప్రమోషన్ పొందనున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ సందర్భంగా ఆమె షేర్ చేసిన బేబీ బంప్ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

Tollywood: రెండోసారి తల్లికాబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. నగ్నంగా బేబీ బంప్ ఫొటోషూట్‌తో..
Tollywood Actress
Basha Shek
|

Updated on: Jan 23, 2025 | 8:15 PM

Share

అమీ జాక్సన్.. బ్రిటన్‌ కు చెందిన ఈ హీరోయిన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఎవడు చిత్రంలో సెకెండ్ హీరోయిన్ గా నటించింది. అలాగే విక్రమ్ హీరోగా శంకర్ తెరకెక్కించిన ఐ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా ఆకట్టుకుంది. వీటితో పాటు పలు తమిళ్, హిందీ సినిమాల్లోనూ నటించి మెప్పించిందీ అందాల తార. అయితే ఇప్పుడు ఈ బ్రిటిష్ నటి విదేశాల్లో స్థిరపడింది. అమీ జాక్సన్ 2015 నుండి 2021 వరకు హోటల్ వ్యాపారి జార్జ్ పనాయోటౌతో రిలేషన్‌షిప్‌ కొనసాగించింది. 2019లో నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే అదే సంవత్సరం అమీ ఒక ఆడబిడ్డను ప్రసవించింది. అప్పటికింకా వారికి పెళ్లి కాలేదు. కానీ 2021లో అమీ, జార్జ్ విడిపోయారు. ఆ తర్వాత ఆమె ఆంగ్ల నటుడు ఎడ్ వెస్ట్‌విక్‌తో డేటింగ్ ప్రారంభించింది. గతేడాది ఆగస్టులో పెళ్లి కూడా చేసుకుంది. ఆ తర్వాత అక్టోబర్‌లో తాను మరోసారి గర్భం ధరించినట్లు ప్రకటించింది అమీ. ఇప్పుడు ఏకంగా బికినీలో తన బేబీ బంప్‌ని చూపిస్తూ కొత్త ఫోటోలను షేర్ చేసిందీ అందాల తార. పూల్ ముందు నగ్నంగా నిలబడిన ఫొటోలు షేర్ చేసిన అమీ జాక్సన్.. ‘దీన్నిప్పుడు స్కిన్నీ డిప్పింగ్ అనలేం’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

అమీ జాక్సన్ షేర్ చేసిన బేబీ బంప్ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. కొంత మంది కంగ్రాట్స్ చెబుతుంటే మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు. ఇలా నగ్నంగా కాకుండా మాములుగా కూడా ప్రెగ్నెన్సీ అనుభూతులు పంచుకోవచ్చని హీరోయిన్ కు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

బేబీ బంప్ తో అమీ జాక్సన్..

2010లో ‘మదరాసపట్నం’ అనే తమిళ సినిమాతో అమీ జాక్సన్ సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత పలు దక్షిణాది చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే ప్రస్తుతం చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటోంది అమీ జాక్సన్. విదేశాల్లో సెటిల్ కావడంతో కొత్త సినిమాలు ఒప్పుకోవడం లేదు. ప్రస్తుతం ఆమె లండన్‌లో ఉంటున్నట్లు సమాచారం. అన్నట్లు ఆమె మోడల్ కూడా.

అమీ జాక్సన్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మటన్, చికెన్ కాదు.. కనుమ రోజు సీ ఫుడ్‌కి భారీ డిమాండ్ ఎందుకంటే?
మటన్, చికెన్ కాదు.. కనుమ రోజు సీ ఫుడ్‌కి భారీ డిమాండ్ ఎందుకంటే?
వాకింగ్ vs మెట్లెక్కడం.. ఏది ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తుంది?
వాకింగ్ vs మెట్లెక్కడం.. ఏది ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తుంది?
ఇండోర్‌లో 'హిట్‌మ్యాన్' తుఫాన్..! కివీస్ బౌలర్లకు చుక్కలే..
ఇండోర్‌లో 'హిట్‌మ్యాన్' తుఫాన్..! కివీస్ బౌలర్లకు చుక్కలే..
అందరూ బాగుండాలని ఆ పని చేస్తే తీసుకెళ్లి జైల్లో పడేశారు..
అందరూ బాగుండాలని ఆ పని చేస్తే తీసుకెళ్లి జైల్లో పడేశారు..
ఈ సమస్యకు మందులు వాడుతున్నారా?.. వంకాయ మీ ప్లేటులో ఉండకూడదు..
ఈ సమస్యకు మందులు వాడుతున్నారా?.. వంకాయ మీ ప్లేటులో ఉండకూడదు..
Moles on Body: ఈ ప్రాంతాల్లో పుట్టు మచ్చలుంటే అదృష్టవంతులు మీరే
Moles on Body: ఈ ప్రాంతాల్లో పుట్టు మచ్చలుంటే అదృష్టవంతులు మీరే
పండగ పూట అత్తారింటికి నిప్పు పెట్టిన అల్లుడు
పండగ పూట అత్తారింటికి నిప్పు పెట్టిన అల్లుడు
సెంచరీతో అదరగొట్టినా.. టీమిండియాను ఓడించిన బ్యాడ్‌లక్ ప్లేయర్లు
సెంచరీతో అదరగొట్టినా.. టీమిండియాను ఓడించిన బ్యాడ్‌లక్ ప్లేయర్లు
పండుగ వేళ కోనసీమకు టెస్లా సైబర్‌ట్రక్‌లో వచ్చింది ఎవరంటే..?
పండుగ వేళ కోనసీమకు టెస్లా సైబర్‌ట్రక్‌లో వచ్చింది ఎవరంటే..?
మీ ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉందా? మీ డైట్‌లో ఈ చేంజ్ చేయండి..
మీ ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉందా? మీ డైట్‌లో ఈ చేంజ్ చేయండి..