AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఒకప్పుడు గ్లామర్ క్వీన్.. ఇప్పుడు దైవ చింతనలో.. ఈ టాలీవుడ్ ప్రముఖ నటిని గుర్తు పట్టారా?

ముంబైలో పుట్టిన ఈ ముద్దుగుమ్మ పలు తెలుగు సినిమాల్లో నటించింది. తన గ్లామర్‌ డ్యాన్స్‌లతో అందరినీ మెప్పించింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లాంటి స్టార్ హీరోలతో కలిసి స్టెప్పులేసింది. అయితే ఇదంతా గతం. ప్రస్తుతం ఈ అందాల తార సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.

Tollywood: ఒకప్పుడు గ్లామర్ క్వీన్.. ఇప్పుడు దైవ చింతనలో.. ఈ టాలీవుడ్ ప్రముఖ నటిని గుర్తు పట్టారా?
Tollywood Actress
Basha Shek
|

Updated on: Jan 22, 2025 | 12:15 PM

Share

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఖుషి, అత్తారింటికి దారేది సినిమాల్లోని స్పెషల్ సాంగ్స్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఖుషిలోని గుండె ఝల్లు మన్నాదిరో, అత్తారింటికి దారేదిలోని ఇట్స్ టైమ్ టు పార్టీ సాంగ్స్ సినిమా విజయాల్లో కీలక పాత్ర పోషించాయి. ఈ రెండు సాంగ్స్ లో తన ఎనర్జిటిక్ డ్యాన్స్ తో అదరగొట్టింది ముంతాజ్ అలియాస్ నగ్మాఖాన్. పవన్ కల్యాణ్ కు పోటీగా స్టెప్పులేసి అభిమానులను ఉర్రూతలూగించింది. ఈ రెండు సినిమాల్లోనే కాదు చాలా బాగుంది, అమ్మో ఒకటో తారఖీఉ, బడ్జెట్ పద్మనాభం, జెమిని, కూలి, కొండవీటి సింహాసనం, ఆగడు, రాజాధి రాజా తదితర సినిమాల్లో సహాయక నటి పాత్రలు, స్పెషల్ సాంగ్స్ చేసింది. ఎక్కువగా గ్లామర్ రోల్స్ కే పరిమితం కావడంతో ఈ ముద్దుగుమ్మ పేరు బాగా వైరలైంది. అయితే తన సినిమా కెరీర్‌ పీక్స్‌లో ఉన్నప్పుడే సినిమాలకు గుడ్ చై చెప్పేసింది. చివరిగా 2015లో టామీ అనే సినిమాలో నటించింది ముంతాజ్. ఆ తర్వాత మరెక్కడా కనిపించలేదు. సినిమా నుంచి పూర్తిగా తప్పుకున్న ముంతాజ్ ఇప్పుడు దైవభక్తి, ఆధ్యాత్మికతలో మునిగిపోయింది. ఇప్పటికే పలు సార్లు మక్కా కు వెళ్లొచ్చింది. అయితే సినిమాలను వదిలేయడానికి గల కారణాలను పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది ముంతాజ్.

‘నేను ముస్లిం కుటుంబంలో పుట్టాను. నాకు ఖురాన్ బాగా తెలుసు. మొదట్లో ఖురాన్‌లో పేర్కొన్న విషయాలను అర్థం చేసుకోలేకపోయాను. అయితే ఒకానొక దశలో దాని అంతరార్థం నాకు అర్థమై నాలో మార్పు వచ్చింది. అందుకే సినిమాలు చేయకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాను. అలాగే ఇప్పుడు హిజాబ్ ధరిస్తున్నాను’

ఇవి కూడా చదవండి

మక్కా యాత్రలో ముంతాజ్..

View this post on Instagram

A post shared by Mumtaz (@mumtaz_mumo)

‘గతంలో నేను చాలా గ్లామరస్‌గా నటించాను. అందుకే ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకునేందుకు కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. నా బోల్డ్ అండ్ గ్లామరస్ ఫొటోలను సామాజిక మధ్యమాల నుంచి తొలగించాలని అనుకుంటున్నాను. కానీ ఆ పని నాకు సాధ్యం కావడం లేదు. అభిమానులు సాధ్యమైనంత వరకూ నా గ్లామరస్‌ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయవద్దు’ అని దీనంగా వేడుకుంటోంది ముంతాజ్. ప్రస్తుతం ఈ నటి ఫొటోలు సామాజి మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. వీటిని చూసిన వారందరూ షాక్ అవుతున్నారు.

అత్తారింటికి దారేది సినిమాలో ముంతాజ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.