Kiran Abbavaram: ‘అమ్మానాన్నలు కాబోతున్నామోచ్’.. శుభవార్త చెప్పిన కిరణ్ అబ్బవరం దంపతులు.. ఫొటోస్ వైరల్
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం శుభవార్త చెప్పాడు. తాను త్వరలో తండ్రిని కాబోతున్న గుడ్ న్యూస్ ను సోషల్ మీడియా వేదికగా అందరితో షేర్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా తన భార్య ప్రముఖ హీరోయిన్ రహస్య గోరఖ్ బేబీ బంప్ తో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇంట అన్నీ శభసకునాలే కనిపిస్తున్నాయి. గతేడాది అతను తన సహ నటి రహస్య గోరఖ్ ను వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత కిరణ్ నటించిన క సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. త్వరలోనే దిల్ రూబా అనే మరో ఆసక్తికర సినిమాతో మన ముందుకు రానున్నాడు కిరణ్. అయితే ఇంతలోనే మరో శుభవార్త వినిపించాడీ ట్యాలెంటెడ్ హీరో. త్వరలో తాను తండ్రిగా ప్రమోషన్ పొందనున్నట్లు తెలిపాడు కిరణ్. ఈ సందర్భంగా గర్భంతో ఉన్న తన భార్య రహస్య గోరఖ్ తో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడీ యంగ్ హీరో. ‘మా ప్రేమ మరో రెండు అడుగులు పెరిగింది’ అని ఈ పోస్టుకు క్రేజీ క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. పలువుర సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు, కిరణ్ – రహస్య జంటకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు.
కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ లది ప్రేమ వివాహం. వీరిద్దరు రాజావారు రాణిగారు సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించారు. ఇద్దరికీ ఇదే మొదటి సినిమా. అంతుకు మందు సాఫ్ట్ వేర్ ఉద్యోగులుగా పనిచేశారు. అయితే సినిమాలపై మక్కువతో ఇండస్ట్రీలోకి వచ్చారు. మొదటి సినిమా షూటింగ్ సమయంలోనే మనసులు ఇచ్చి పుచ్చుకున్నారు. సుమారు ఐదేళ్లు ప్రేమలో మునిగితేలారు. ఆ తర్వాత పెద్దల అనుమతిలో గతేడాది ఏడాది ఆగస్టు 22న పెళ్లిపీటలెక్కారు. కర్ణాటకలోని కూర్గ్‌లో వీరి వివాహం ఘనంగా జరిగింది.
భార్యతో కిరణ్ అబ్బవరం..
Our love is growing by 2 feet 👣👼🐣 pic.twitter.com/69gL0sALaZ
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) January 21, 2025
కాగా రహస్య గోరఖ్ తో పెళ్లి కిరణ్ అబ్బవరం కు బాగా కలిసొచ్చిందని చెప్పవచ్చు. పెళ్లి తర్వాత ఈ హీరో నటించిన క సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఏకంగా 50 కోట్ల వసూళ్లు సాధించి కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడీ సక్సెస్ ను కొనసాగించేందుకు దిల్ రుబా సినిమతో మన ముందుకు వస్తున్నాడు కిరణ్. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న ఈ మూవీ రిలీజ్ కానుంది.
దిల్ రుబా మూవీ ప్రమోషన్ ఈవెంట్స్ లో కిరణ్ అబ్బవరం, రుక్సార్ థిల్లాన్..
Madanapalle ❤️https://t.co/8SvfwuzQRU@saregamasouth @YoodleeFilms @SivamCelluloids #Dilruba #Aggipulle pic.twitter.com/ZcBb1J3aec
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) January 19, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








