వెంకటేష్‌తో ఉన్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పటికీ అదే అందంతో..
విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడిలది సూపర్ హిట్ కాంబినేషన్. గతంలో వీరి కాంబోలో ఎఫ్ 2, ఎఫ్ 3 వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడీ విజయ పరంపరను కొనసాగిస్తూ సంక్రాంతకి వస్తున్నాం సినిమాతో మన ముందుకు వచ్చారు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కు సూపర్ హిట్ టాక్ వచ్చింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి వెంకీ మామ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది

విక్టరీ వెంకటేష్ రీసెంట్‌గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ హిట్ అందుకున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు, సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు వెంకటేష్. సంక్రాంతికి వస్తున్నాం సినిమా వెంకటేష్ 76 సినిమా అంతకు మందు వచ్చిన సైందవ్ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఈ సినిమా పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సంక్రాంతికి వస్తున్నాం సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పటికే ఈ సినిమా రూ.150 కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.
ఇక ఇప్పుడు వెంకటేష్ ఓల్డ్ ఫోటోలు సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి. ఈ క్రమంలో పైన కనిపిస్తున్న ఫోటో ఒకటి న నెట్టింట అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇంతకు పై ఫొటోలో వెంకటేష్ తో ఉన్న హీరోయిన్ ఎవరో తెలుసా.? తన నటనతో అందంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ ఆమె. ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పటికీ సినిమాలు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్న హీరోయిన్ ఆమె. పై ఫొటోలో వెంకటేష్ తో ఉన్న సూపర్ హాట్ బ్యూటీ ఎవరో కాదు సీనియర్ హీరోయిన్ ఖుష్బూ సుందర్. వెంకటేష్ ఖుష్బూ కలిసి సినిమాలు చేసి ఆకట్టుకున్నారు.
వెంకటేష్ తొలి సినిమా కలియుగపాండవులు సినిమాలో ఖుష్బూ హీరోయిన్ గా చేశారు. కలియుగపాండవులు సూపర్ హిట్ అయ్యింది. అప్పట్లో ఈ సినిమా సెన్సేషన్ అనే చెప్పాలి ఆతర్వాత ఖుష్బూ హీరోయిన్ గా బిజీ అయ్యింది. తెలుగు, తమిళ్ భాషల్లో వరుసగా సినిమాలు చేసింది. తెలుగు, తమిళ్ లో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు అమ్మ, అత్త, వదిన పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకుంటుంది. అలాగే రాజకీయాల్లోనూ ఖుష్బూ రాణిస్తున్నారు. నటుడు , దర్శకుడు కూడా సుందర్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.