AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేవుడా..! ఆ చైల్డ్ ఆర్టిస్ట్.. ఈ హాట్ బ్యూటీ ఒక్కరేనా..!! రీసెంట్‌గా బ్లాక్ బస్టర్ హీరోయిన్ ఆమె

ఇండస్ట్రీలో ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన చిన్నారులు.. ఇప్పుడు హీరోహీరోయిన్లుగా రాణిస్తున్నారు. ఇప్పటికే తెలుగులో తేజా సజ్జా.. హీరోగా మారి ఆతర్వాత హనుమాన్ సినిమాతో స్టార్ డమ్ అందుకున్నాడు. సంతోష్ శోభన్, సంగీత్ శోభన్, శ్రీవిధ్య, కావ్య కళ్యాణ్ రామ్, అనిక సురేంద్రన్, ఎస్తేర్ అనిల్.. ఇలా చాలా మంది ఉన్నారు..

దేవుడా..! ఆ చైల్డ్ ఆర్టిస్ట్.. ఈ హాట్ బ్యూటీ ఒక్కరేనా..!! రీసెంట్‌గా బ్లాక్ బస్టర్ హీరోయిన్ ఆమె
Actress
Rajeev Rayala
|

Updated on: Jan 20, 2025 | 11:19 AM

Share

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ కిడ్స్ ఉన్నారు. సినీ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చి అవకాశాలు అందుకుంటూ సినిమాలు చేస్తున్న వారు మన దగ్గర కోకొల్లలు. అయితే అందరూ సక్సెస్ కాలేకపోతున్నారు. తమ నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ కొంతమంది దూసుకుపోతున్నారు. ఇక ఇప్పుడున్న స్టార్ కిడ్స్ చాలా మంది గతంలో చైల్డ్ ఆర్టిస్ట్ లుగా సినిమాలు చేసిన వారే.. కొంతమంది పదుల సంఖ్యలో సినిమాలు చేస్తే మరికొంతమంది ఒకటిరెండు సినిమాల్లో మెరిశారు. అలాగే పైన కనిపిస్తున్న అమ్మడు కూడా.. పై ఫొటోలో ఉన్న చైల్డ్ ఆర్టిస్ ను గుర్తుపట్టారా.? అంత సులభం కాదులెండి. ఆమె అప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోయింది. ఇప్పుడు హీరోయిన్ గా దూసుకుపోతుంది ఆ స్టార్ కిడ్. రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సాధించి వందకోట్లకు పైగా రాబట్టిన సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఇంతకూ ఆమె ఎవరంటే..

ఇది కూడా చదవండి :చిట్టి గుమ్మా.. ఇన్నిరోజులు ఏమైపోయావమ్మా..! ప్రేమకథ చిత్రం హీరోయిన్ను చూశారా..!

పై ఫొటోలో రాజేంద్ర ప్రసాద్ తో ఉన్న చిన్నారి ఎవరో కనిపెట్టరా.? ఆ ఫోటో రాంబంటు సినిమాలోది ఆ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన హీరోయిన్ ఎవరో కాదు అందాల భామ ఐశ్వర్య రాజేష్. రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది ఈ అమ్మడు. తెలుగుఅమ్మాయే అయినా తమిళ్ లో ఈ చిన్నది కెరీర్ మొదలు పెట్టింది. అక్కడ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆతర్వాత కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :ఎంత కష్టం వచ్చింది భయ్యా..! ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా.? ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే

ఆతర్వాత వరల్డ్ ఫెమస్ లవర్, టక్ జగదీశ్ సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక తాజాగా అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకీ భార్యగా నటించి మెప్పించింది. ఈ సినిమాలో ఐశ్వర్య తన నటనతో ఆకట్టుకుంది. భాగ్యం పాత్రలో తన నటనతో కట్టిపడేసింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో పాటు వందకోట్లకు పైగా వసూల్ చేసి బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతుంది. అలాగే ఐశ్వర్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన గ్లామరస్ ఫొటోలతో కుర్రాళ్లను కవ్విస్తుంది ఈ చిన్నది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us