AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిట్టి గుమ్మా.. ఇన్నిరోజులు ఏమైపోయావమ్మా..! ప్రేమకథ చిత్రం హీరోయిన్ను చూశారా..!

సుధీర్ బాబు హీరోగా నటించిన ప్రేమ కథ చిత్రం సూపర్ హిట్ సాధించింది. ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహించారు. 2013 ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నందిత రాజ్ నటించింది. సప్తగిరి, ప్రవీణ్ కీలక పాత్రలో నటించారు.

చిట్టి గుమ్మా.. ఇన్నిరోజులు ఏమైపోయావమ్మా..! ప్రేమకథ చిత్రం హీరోయిన్ను చూశారా..!
Premakatha Chitram
Rajeev Rayala
|

Updated on: Jan 18, 2025 | 9:19 PM

Share

ఒక్క హిట్ ఒక్కటంటే ఒకే ఒక్క హిట్ పడితే చాలు అని ఎదురుచూసే హీరోలు ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో సుధీర్ బాబు ఒకరు. హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ యంగ్ హీరో. ఏడాదికి రెండు మూడు సినిమాలు తగ్గకుండా రిలీజ్ చేస్తున్నాడు సుధీర్ బాబు. కానీ ఈ యంగ్ హీరోకు ఇంతవరకు సాలిడ్ హిట్ మాత్రం దక్కలేదు. ఇక సుధీర్ బాబు నటించిన సినిమాల్లో సూపర్ హిట్ సినిమా అంటే టక్కున చెప్పే పేరు ప్రేమకథ చిత్రం. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నందిత రాజ్ నటించింది. సప్తగిరి, ప్రవీణ్ కీలక పాత్రలో నటించారు.

ఇది కూడా చదవండి : మగాడితో పనేంటీ.. ఆ ఒక్కదానికే కావాలి.. షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్

అలాగే ప్రేమకథ చిత్రం సినిమాలో సప్తగిరి చేసిన కామెడీ సినిమాకే హైలైట్ గా నిలిచింది. అలాగే హీరోయిన్ నందిత తన అందంతో నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాలో నందిత అందానికి కుర్రాళ్లంతా ఫిదా అయ్యారు. ఈ సినిమా తర్వాత ఎంతో మంది ఫెవరెట్ హీరోయిన్ గా మారిపోయింది ఈ చిన్నది. ఈ సినిమా తర్వాత నందిత పెద్ద హీరోయిన్ అవుతుందని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : అప్పుడు యావరేజ్ బ్యూటీ.. ఇప్పుడు హీటు పెంచే హాటీ.. చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే

నిజానికి తేజ దర్శకత్వం వహించిన నీకు నాకు డాష్ డాష్ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ప్రేమ కథ చిత్రం సినిమా తర్వాత నందిత వరుసగా సినిమాలు చేసింది. మరోసారి సుధీర్ బాబుతో కలిసి కృష్ణమ్మ కలిపింది నిన్ను నన్ను సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఈ అమ్మడికి అవకాశాలు తగ్గిపోయాయి. ఆతర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకొని ఎన్టీఆర్ నటించిన జై  లవకుశ సినిమాలో చిన్న పాత్ర చేసింది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు ఎలా ఉంది అని చాలా మంది గూగుల్ ను గాలిస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిన్నదాని కొన్ని ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండకపోవడంతో ఆమె లేటెస్ట్ ఫోటోలు ఎక్కడ కనిపించడం లేదు.

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్