AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్టీఆర్, చిరంజీవిలాంటి స్టార్ హీరోలతో చేసింది..ఇప్పుడు సినిమాలు లేక ఇలా..

హీరోయిన్స్‌కు సంబందించిన ఫోటోలను అభిమానులు ఎంత పదిలంగా దాచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా అందుబాటులోకి రాక ముందు పేపర్లో వచ్చిన హీరోయిన్ ఫోటోలను కట్ చేసి గోడల మీద లేదంటే.. పుస్తకాల్లో దాచుకునేవాళ్ళు కుర్రాళ్ళు.. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది.

ఎన్టీఆర్, చిరంజీవిలాంటి స్టార్ హీరోలతో చేసింది..ఇప్పుడు సినిమాలు లేక ఇలా..
Actress
Rajeev Rayala
|

Updated on: Jan 20, 2025 | 11:34 AM

Share

హీరోయిన్స్ చాలా మంది ఇప్పుడు సినిమాలకు గుడ్ బై చెప్పేశారు. కొంతమంది పెళ్లి చేసుకొని, పిల్లల్ని కానీ ఫ్యామిలీతో హ్యాపీగా గడిపేస్తున్నారు. మరికొంతమంది అవకాశాలు రాకపోవడంతో సినిమాలకు ఇండస్ట్రీకి దూరం అవుతున్నారు. చాలా మంది హీరోయిన్స్ ను ప్రేక్షకులు మర్చిపోయారు కూడా.. అయితే సినిమాలకు గుడ్ బై చెప్పి ఫ్యాన్స్ ను నిరాశపరిచిన భామల్లో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించింది. వరుస సినిమాలతో ఇండస్ట్రీని అల్లాడించింది. కానీ ఇప్పుడు ఇండస్ట్రీకి దూరం అయ్యింది. పెళ్లి చేసుకొని ఫ్యామిలీతో సెటిల్ అయ్యింది. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది. అంతే కాదు అప్పుడు క్రేజీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఆమె ఇప్పుడు షాకింగ్ లుక్ లోకి మారిపోయింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

ఇది కూడా చదవండి :చిట్టి గుమ్మా.. ఇన్నిరోజులు ఏమైపోయావమ్మా..! ప్రేమకథ చిత్రం హీరోయిన్ను చూశారా..!

టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసింది. ఎన్టీఆర్, చిరంజీవి లాంటి టాలీవుడ్ హీరోలతో పాటు తమిళ్ లో సూర్య తోనూ సినిమా చేసి బ్లాక్ బస్టర్ అందుకుంది. కానీ ఇప్పుడు ఊహించని విధంగా సినిమాలకు దూరం అయ్యింది. ఆమె ఎవరో కాదు అందాల భామ సమీరారెడ్డి. ఈ ముద్దుగుమ్మ ప్రధానంగా హిందీ ఇండస్ట్రీలో సినిమాలు చేసింది. 2005లో వచ్చిన నరసింహుడు సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది సమీరా రెడ్డి. ఆతర్వాత చిరంజీవి నటించిన జై చిరంజీవ సినిమాతో ఆకట్టుకుంది.

ఇది కూడా చదవండి :ఎంత కష్టం వచ్చింది భయ్యా..! ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా.? ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే

ఆతర్వాత మరోసారి ఎన్టీఆర్ సరసన అశోక్ సినిమాలో మెరిసింది. ఆతర్వాత ఈ చిన్నది ఊహించని విధంగా టాలీవుడ్ కు దూరం అయ్యింది. హిందీలోనే ఎక్కువ సినిమాలు చేసింది. చాలా రోజుల తర్వాత రానా నటించిన కృష్ణం వందే జగద్గురుం సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఆతర్వాత కొంతకాలానికే హిందీ సినిమాలకు కూడా గుడ్ బై చెప్పేసింది. ఇక ఈ అమ్మడు తమిళ్ స్టార్ హీరో సూర్యతో కలిసి చేసిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ మూవీ. కాగా సమీరా ఇప్పుడు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంది. సోషల్ మీడియాలో రీల్స్ , వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది సమీరా రెడ్డి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us