AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Neeraj Chopra: నీరజ్ చోప్రా ఎంత కట్నం తీసుకున్నాడో తెలుసా? మరీ ఇంత మంచోడివేంటి గురూ!

బల్లెం వీరుడు, భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా తన స్నేహితురాలు హిమానీ మోర్‌ను వివాహం చేసుకున్నాడు. జనవరి 17నే వీరి పెళ్లి జరగ్గా, ఆదివారం (జనవరి 19) రాత్రి తమ పెళ్లి విషయాన్ని మీడియాకు తెలియజేశారు నీరజ్ చోప్రా- హిమాని.

Neeraj Chopra: నీరజ్ చోప్రా ఎంత కట్నం తీసుకున్నాడో తెలుసా? మరీ ఇంత మంచోడివేంటి గురూ!
Neeraj Chopra
Basha Shek
|

Updated on: Jan 21, 2025 | 11:55 AM

Share

స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా తన స్నేహితురాలు హిమానీ మోర్‌ను జనవరి 17న వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆదివారం రాత్రి వారిద్దరూ తమ పెళ్లి విషయాన్ని మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా నీరజ్ చోప్రా తన పెళ్లికి సంబంధించిన కొన్ని ఫొటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో క్రీడాభిమానులతో సహా అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇంత సడెన్ గా పెళ్లేందుకు చేసుకున్నాడంటూ షాక్ అయ్యారు.. ఇప్పుడు నీరజ్ చోప్రా పెళ్లికి సంబంధించి మరో ముఖ్యమైన విషయం బయటకు వచ్చింది. నీరజ్ చోప్రా తన అత్తామామల నుంచి ఎంత కట్నం తీసుకున్నాడనేది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. నీరజ్ చోప్రా పెళ్లి కోసం అసలు కట్నం తీసుకోలేదట. అయితే వద్దనుకోకుండా అత్తా మామల నుంచి కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకున్నాడట. ఈ విషయాన్ని నీరజ్ చోప్రా మేనమామ సురేంద్ర చోప్రా వెల్లడించారు. ‘నీరజ్ చోప్రా వివాహం సంప్రదాయ పద్ధతిలో ఎంతో వైభవంగా జరిగింది. ఇప్పుడు మేము చాలా సంతోషంగా ఉన్నాం’ అని సురేంద్ర చోప్రా తెలిపారు.

నీరజ్ చోప్రా మామ కూడా ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఎందుకు పెళ్లి చేసుకున్నాడనే విషయాన్ని కూడా బయటపెట్టాడు. ‘ఇరు కుటుంబాల అంగీకారంతోనే నీరజ్ చోప్రా వివాహం జరిగింది. హర్యానా సంప్రదాయం ప్రకారం ఈ వివాహం జరిగింది. ఈ పెళ్లిని మాటల్లో చెప్పలేనంతగా ఎంజాయ్ చేశాం. నీరజ్ పెళ్లికి కట్నం తీసుకోలేదు. ఒక్క రూపాయి మాత్రమే తీసుకున్నారు’ అని సురేంద్ర చోప్రా చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఈ వివాహం గురించి సమాచారం ఇస్తూ, నీరజ్ చోప్రా రెండవ మేనమామ భీమ్ చోప్రా మాట్లాడుతూ’ ఈ వివాహానికి చాలా రోజులుగా సన్నాహాలు జరుగుతున్నాయి. నీరజ్, హిమానీ ఇద్దరూ గత రెండేళ్లుగా ఒకరికొకరు తెలుసు. వారు ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా కలుసుకున్నారు. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. గత కొన్ని నెలలుగా నీరజ్ మరియు హిమానీల పెళ్లికి సన్నాహాలు జరుగుతున్నాయి.  నీరజ్ పెళ్లి చేసుకోబోతున్నాడని మాకు, హిమాని కుటుంబానికి మాత్రమే తెలుసు. కనీసం ఈ విషయం పురోహితుడికి కూడా తెలియదు. నీరజ్ కూడా అదే కోరుకున్నాడు’ అని చెప్పుకొచ్చారు.

 నీరజ్ చోప్రా, హిమానీల పెళ్లి ఫొటోస్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రేకుల షెడ్డు లీకేజీలతో ఇబ్బందా? తక్కువ ఖర్చుతో బెస్ట్ ట్రిక్
రేకుల షెడ్డు లీకేజీలతో ఇబ్బందా? తక్కువ ఖర్చుతో బెస్ట్ ట్రిక్
డాక్టర్ చనిపోయే ముందు హైవేపై ఏం జరిగింది..? నెట్టింట వీడియో వైరల్
డాక్టర్ చనిపోయే ముందు హైవేపై ఏం జరిగింది..? నెట్టింట వీడియో వైరల్
జపాన్ వెళ్లిన టీమిండియా.. అభిషేక్ శర్మ లగేజ్ చూశారా..?
జపాన్ వెళ్లిన టీమిండియా.. అభిషేక్ శర్మ లగేజ్ చూశారా..?
చిన్నపిల్లలకు ఇచ్చే దగ్గు మందు సీసాలపై కేంద్రం హెచ్చరిక!
చిన్నపిల్లలకు ఇచ్చే దగ్గు మందు సీసాలపై కేంద్రం హెచ్చరిక!
రష్యాపై ఉక్రెయిన్ కీలక నిర్ణయం..రాత్రికి రాత్రే ఏం చేసిందో తెలుసా
రష్యాపై ఉక్రెయిన్ కీలక నిర్ణయం..రాత్రికి రాత్రే ఏం చేసిందో తెలుసా
బాడీలోని కొవ్వును కరిగించే మొనగాడు ఆకు.. షుగర్ కూడా కంట్రోల్
బాడీలోని కొవ్వును కరిగించే మొనగాడు ఆకు.. షుగర్ కూడా కంట్రోల్
మీ UPI పిన్ సురక్షితంగా మార్చుకోవడం లేదా రీసెట్ చేయడం ఎలా?
మీ UPI పిన్ సురక్షితంగా మార్చుకోవడం లేదా రీసెట్ చేయడం ఎలా?
పుట్టగొడుగులు త్వరగా బూజు పడుతున్నాయా?ఎక్కువ రోజులు తాజాగా ఉండాలా
పుట్టగొడుగులు త్వరగా బూజు పడుతున్నాయా?ఎక్కువ రోజులు తాజాగా ఉండాలా
ఆసియా గేమ్స్‌లో నాలుగో పతకం కైవసం..!
ఆసియా గేమ్స్‌లో నాలుగో పతకం కైవసం..!
మహేష్ బాబు పిన్నీ ఈ తెలుగు నటికి మేనత్త అని తెలుసా..
మహేష్ బాబు పిన్నీ ఈ తెలుగు నటికి మేనత్త అని తెలుసా..