AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT: ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ కామెడీ థ్రిల్లర్ .. బుక్ మై షో టాప్ రేటింగ్ మూవీని ఎక్కడ చూడొచ్చంటే?

ఎప్పటిలాగే ఈ శుక్రవారం (జనవరి 24) కూడా పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీలోకి వచ్చేశాయి. తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లిష్ తదితర భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

OTT: ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ కామెడీ థ్రిల్లర్ .. బుక్ మై షో టాప్ రేటింగ్ మూవీని ఎక్కడ చూడొచ్చంటే?
OTT Movie
Basha Shek
|

Updated on: Jan 24, 2025 | 8:33 AM

Share

బ్రహ్మానందం తర్వాత తెలుగు ప్రేక్షకులను ఆ స్థాయిలో నవ్విస్తోన్న స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్. క్యారెక్టర్ ఏదైనా తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడం ఈ నటుడి స్టైల్. తన క్రేజ్ కు తగ్గట్టుగానే స్టార్ హీరోల సినిమాల్లో కమెడియన్ గా నటిస్తూనే, సోలో హీరోగానూ ఆకట్టుకుంటున్నాడు వెన్నెల కిశోర్. అలా అతను టైటిల్ రోల్ పోషించిన లేటెస్ట్ సినిమా ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. ఎన్నో విజయవంతమైన సినిమాలకు రచయతగా పని చేసిన రైటర్‌ మోహన్‌ ఈ సినిమాను తెరకెక్కించాడు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ కు ముందే ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ ‘బుక్ మై షో’లో ఈమూవీకి 7.5 రేటింగ్ రావడం విశేషం. ఎప్పటిలాగే వెన్నెల కిశోర్ తన కామెడీతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. డిటెక్టివ్ పాత్రలో అదరగొట్టాడు. అలాగే తెలుగమ్మాయి అనన్య నాగళ్ల కూడా ఆకట్టుకుది. థియేటర్లలో ఆడియెన్స్ ను మెప్పించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ యాప్ ఈటీవీ విన్ సొంతం చేసుకుంది. శుక్రవారం (జనవరి 24) అర్ధ రాత్రి నుంచి వెన్నెల కిశోర్ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసుకొచ్చింది. థియేటర్లలో లాంగ్ రన్ కొనసాగించలేకపోయిన ఈ మూవీ నెలరోజుల్లోపే ఓటీటీలోకి రావడం గమనార్హం.

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ సినిమాలో వెన్నెల కిశోర్, అనన్య నాగళ్ల జోడీ హైలెట్ గా నిలిచింది. వీరితో పాటు రవితేజ మహాదాస్యం, ‘నేనింతే’ ఫేమ్ సియా గౌతమ్, కాలకేయ ప్రభాకర్, మురళీ ధర్ గౌడ్ ప్రధాన పాత్రలు పోషించారు. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ చిత్రాన్ని లాస్య రెడ్డి సమర్పణలో శ్రీ గణపతి సినిమాస్ పతాకం మీద వెన్నపూస రమణారెడ్డి నిర్మించారు. ‘కమిటీ కుర్రోళ్లు’, ‘ఆయ్‌’, ‘క’ లాంటి విజయవంతమైన చిత్రాలను డిస్ట్రిబ్యూట్‌ చేసిన వంశీ నందిపాటి ఈ సినిమాను విడుదల చేశారు. మరి థియేటర్లలో శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ సినిమాను మిస్ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

ఇవి కూడా చదవండి

ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఐపీఎల్ వేలంలో ధోని దోస్త్‌కు ఘోర అవమానం.. కట్‌చేస్తే..
ఐపీఎల్ వేలంలో ధోని దోస్త్‌కు ఘోర అవమానం.. కట్‌చేస్తే..
అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కోసి.. అదే రోజు మరోసారి న్యూ ఇయర్
అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కోసి.. అదే రోజు మరోసారి న్యూ ఇయర్
ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు ఆధార్‌ అక్కర్లేదిక.?
ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు ఆధార్‌ అక్కర్లేదిక.?
9 నెలల్లో రూ.45 కోట్ల రీఫండ్లు అందించిన NCH
9 నెలల్లో రూ.45 కోట్ల రీఫండ్లు అందించిన NCH
పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎంత నిధి ఉంది.. తెరుచుకోనున్న రత్న భండార్..
పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎంత నిధి ఉంది.. తెరుచుకోనున్న రత్న భండార్..
రాజాసాబ్ ప్రీరిలీజ్ వేడుకలో డైరెక్టర్ కన్నీళ్లు.. ఏం జరిగిందంటే..
రాజాసాబ్ ప్రీరిలీజ్ వేడుకలో డైరెక్టర్ కన్నీళ్లు.. ఏం జరిగిందంటే..
గుడ్‌న్యూస్‌.. ట్రైన్‌ బయలుదేరడానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్
గుడ్‌న్యూస్‌.. ట్రైన్‌ బయలుదేరడానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్
అల్లూరి వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళలు మారాయ్..కొత్త టైమింగ్స్ ఇవే
అల్లూరి వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళలు మారాయ్..కొత్త టైమింగ్స్ ఇవే
Viral Video: ఒక్క క్యాచ్‌తో రూ. 1.07 కోట్ల జాక్‌పాట్..
Viral Video: ఒక్క క్యాచ్‌తో రూ. 1.07 కోట్ల జాక్‌పాట్..
ఇదేం చలి బాబోయ్‌.. వచ్చే 2 రోజులు 2°Cకి పడిపోనున్న ఉష్ణోగ్రతలు..!
ఇదేం చలి బాబోయ్‌.. వచ్చే 2 రోజులు 2°Cకి పడిపోనున్న ఉష్ణోగ్రతలు..!