AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఇన్‌స్టాలో భర్త ఫొటోలను డిలీట్ చేసిన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. విడాకులపై హింట్ ఇచ్చిందా?

కారణాలు ఏమైనా ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా సెలబ్రిటీల కాపురాలు అసలు నిలబడడం లేదు. సినిమా, క్రీడారంగానికి సంబంధించి పలువురు ప్రముఖులు ఇటీవల విడాకులు తీసుకుని విడిపోయాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ కూడా చేరిందని ప్రచారం జరుగుతోంది.

Tollywood: ఇన్‌స్టాలో భర్త ఫొటోలను డిలీట్ చేసిన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. విడాకులపై హింట్ ఇచ్చిందా?
Tollywood Actress
Basha Shek
|

Updated on: Jan 23, 2025 | 8:57 PM

Share

ఈ మధ్య కాలంలో విడాకులు తీసుకునేవారి సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. అయితే ఈ విషయాన్ని కొందరు అధికారికంగా ప్రకటిస్తుంటే మరికొందరు మాత్రం విడాకుల విషయాన్ని అధికారికంగా చెప్పనప్పటికీ ఇన్ డైరెక్టుగా హింట్స్ ఇస్తున్నారు. తమ సామాజిక మాధ్యమాల్లో భర్తతో కలిసున్న ఫొటోలు, వీడియోలు తొలగిస్తున్నారు. ఆ తర్వాత మెల్లగా విడాకుల ప్రకటనతో షాక్ ఇస్తున్నారు. ఇప్పుడీ జాబితాలోకి టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ కూడా చేరిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆమె మరెవరో కాదు కలర్స్ స్వాతి. యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె నటిగా, సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘డేంజర్’ తో సినిమాల్లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత వెంకటేష్ ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ సినిమాలో త్రిష చెల్లెలి పాత్రలో అదరగొట్టింంది. ఇక అష్టా చమ్మా సినిమాతో హీరోయిన్ గానూ సక్సెస్ అయ్యింది. దీని తర్వాత స్వామి రారా, కార్తికేయ, గోల్కొండ హైస్కూల్ , త్రిపుర, లండన్ బాబులు వంటి సూపర్ హిట్ సినిమాల్లో కథానాయికగా అలరించింది. మిరపకాయ్, కందిరీగ, బంగారు కోడిపెట్ట తదితర సినిమాల్లో క్యామియో రోల్స్ పోషించింది. ఇక చివరిగా 2023లో మంత్ ఆఫ్ మధు సినిమాలో కనిపించింది స్వాతి.

సినిమా కెరీర్ పీక్స్‌లో ఉండగానే కేరళకు చెందిన పైలట్ వికాస్ వాసును పెళ్లి చేసుకుంది స్వాతి. 2018లో వీరి వివాహం జరిగింది. అయితే పెళ్లైన కొన్నేళ్లకే వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి నట్లు ప్రచారం జరిగింది. ఇక మంత్ ఆఫ్ మధు సినిమా ప్రమోషన్స్ సమయంలోనూ భర్త గురించి అడిగితే, సమాధానం చెప్పనంటూ తేల్చి చెప్పేసింది.

 అవార్డు ఫంక్షన్ లో కలర్స్ స్వాతి..

View this post on Instagram

A post shared by Sai DURGHA Tej (@jetpanja)

ఇప్పుడు మరోసారి స్వాతి విడాకుల గురించి సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. దీనిక కారణం.. ఆమె తన సోషల్ మీడియా అకౌంట్లలో పెళ్లి ఫొటోలతో పాటు భర్తకు సంబంధించిన ఫోటోలన్నింటినీ డిలీట్ చేసేసింది. దీంతో స్వాతి ఇన్‌డైరెక్టుగా విడాకులపై హింట్ ఇచ్చేసిందంటున్నారు. మరి ఇది నిజమో? అబద్ధమో తెలియాలంటే స్వాతి లేదా ఆమె భర్తయినా నోరు విప్పాలి.

స్వాతి లేటెస్ట్ ఫొటోస్..

View this post on Instagram

A post shared by Swathi (@swati194)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్