AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravi Rathod: తల్లిదండ్రులు చనిపోయి.. తాగుడుకు బానిసై.. విక్రమార్కుడు చైల్డ్ ఆర్టిస్ట్ కథ వింటే కన్నీళ్లు ఆగవు

గతంలో ఛైల్డ్ ఆర్టిస్టులుగా నటించి మెప్పించిన ఎంతో మంది ఇప్పుడు హీరోలు, హీరోయిన్లుగా ఆకట్టుకుంటున్నారు. ఈ పిల్లవాడు కూడా అదే దారిలో నడుస్తానుకున్నారు. హీరోగా అలరిస్తాడనుకున్నారు. కానీ అందరి జీవితాలు ఒకేలా ఉండవు కదా! ఈ రవి రాథోడ్ కథ కూడా అలాంటిదే

Ravi Rathod: తల్లిదండ్రులు చనిపోయి.. తాగుడుకు బానిసై.. విక్రమార్కుడు చైల్డ్ ఆర్టిస్ట్ కథ వింటే కన్నీళ్లు ఆగవు
Ravi Rathod
Basha Shek
|

Updated on: Jan 23, 2025 | 7:44 PM

Share

‘రేయ్ సత్తి.. బాలు అటు వచ్చిందా?’.. విక్రమార్కుడు సినిమాలో రవితేజ గుమ్మం ఎదట నిలబడి అడిగే పిల్లవాడు చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఆ పిల్లోడి పేరు రవి రాథోడ్. ఒక్క విక్రమార్కుడు సినిమాలోనే కాదు ఆంధ్రవాలా, ఖడ్గం, జెమిని, మాస్‌, బొమ్మరిల్లు, డాన్‌, హైదరాబాద్‌ నవాబు, శంకర్‌దాదా ఎంబీబీఎస్‌.. ఇలా దాదాపు యాభైకి పైగా సూపర్ హిట్ సినిమాల్లో రవి రాథోడ్ ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు. చిన్నప్పుడే ఎంతో ఈజ్ గా నటించిన అతనిని చూసి భవిష్యత్ లో మంచి నటుడు అవుతాడనుకున్నారు చాలా మంది. కానీ ఇప్పుడు ఆ కుర్రాడు రోడ్లపై తిరుగుతున్నాడు. మందుకు బానిసై ఎవరు గుర్తుపట్టలేని స్థితికి మారిపోయాడు. ఒక యూట్యూబర్ రవి రాథోడ్ ను గుర్తు పట్టడం, అతనితో సంభాషణ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అతని గురించి తెలిసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రవి రాథోడ్ తన జీవితంలోని విషాదాన్ని అందరితో పంచుకున్నాడు. స్టార్ నటుడిగా మారాల్సిన తాను తాగి రోడ్లపై తిరగడానికి గల కారణాలను బయట పెట్టాడు.

‘నాది మిర్యాలగూడ. చిన్నప్పుడు నేను సంపాదించిన డబ్బుతోనే నాన్న ఇల్లు కట్టాడు. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నేను నటించిన చివరి సినిమా ఎస్‌ఎమ్‌ఎస్‌. అప్పుడే అమ్మానాన్న, బామ్మ ఇంట్లోనే ఒంటికి నిప్పంటించుకుని చనిపోయారు. నేను షూటింగ్‌కు వెళ్లొచ్చేసరికి అందరూ శవాలై పడి ఉన్నారు. దీంతో మా ఇంటిని పిన్నిబాబాయ్‌ వాళ్లకు ఇచ్చేసి నేను బయటకు వచ్చేశాను. నా దీన స్థితిని చూసి రాఘవ లారెన్స్ దత్తత తీసుకున్నాడు. లక్షలాది రూపాయల ఫీజు కట్టి నన్ను స్కూల్ తో పాటు హాస్టల్ లో చేర్పించాడు. అయితే నేను ఒకసారి సెలవులకు వచ్చినప్పుడు ఇంటి దగ్గరే ఉండిపోయాను. ఆ తర్వాత తిరిగి వెళ్లలేదు. మొన్నామధ్య సెట్‌లో రాజమౌళి సర్‌ నన్ను చూసి వీపుపై రెండు దెబ్బలు వేశాడు. ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌గా అన్ని సినిమాలు చేసి సెట్‌లో ఇలా ఎందుకు పని చేస్తున్నావని తిట్టాడు. ఆరోజు షెడ్యూల్‌ అయ్యాక ఒకసారి కలవమన్నారు. కానీ నేనే వెళ్లలేదు’

ఇక నేను నటుడిగా కొనసాగకపోవడానికి చాలా కారణాలున్నాయి. నేను సినిమాల్లో స్థిరపడదామని అనుకున్నాను. అవకాశాల కోసం కాళ్లరిగేలా తిరిగాను. కానీ రేపు రా, ఎల్లుండి రా.. అని తిప్పించుకున్నారు. ఇలా ఛాన్సుల కోసం అడుక్కోవడం ఎందుకని తిరగడం మానేశాను. ఇదే సమయంలో నేను మద్యానికి బానిసయ్యాను. తాగకపోతే ఏవేవో చేదు జ్ఞాపకాలు గుర్తొస్తాయి. అందుకే ఒక్క రోజు కూడా తాగకుండా ఉండలేను’ అని తన కన్నీటి గాథను పంచుకున్నాడు రవి రాజ్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత