- Telugu News Photo Gallery Cinema photos Bigg Boss Telugu Fame Shobha Shetty Birthday Celebrations With Friends Photos Go Viral
Shobha Shetty: గ్రాండ్‌గా శోభా శెట్టి బర్త్ డే.. సందడి చేసిన బిగ్ బాస్ ఫ్రెండ్స్.. ఫొటోస్ ఇదిగో
బిగ్‌బాస్ బ్యూటీ మోనిత అలియాస్ శోభా శెట్టి బర్త్‌డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తన బిగ్ బాస్ ఫ్రెండ్స్ టేస్టీ తేజ, ప్రియాంక జైన్, అమర్ దీప్ తదితరులు శోభా శెట్టి బర్త్ డే వేడుకలను గ్రాండ్ గా నిర్వహించారు.
Updated on: Jan 23, 2025 | 9:46 PM

1. బిగ్ బాస్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో శోభా శెట్టి కూడా ఒకరు. ఏడో సీజన్ లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన ఆమె తన ఆట, మాటతీరుతో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది.

ఇటీవలే బిగ్ బాస్ కన్నడ రియాలిటీ షోలోనూ పాల్గొంది శోభా శెట్టి. అయితే ఎక్కువ రోజుల ఉండలేనంటూ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది.

ఇటీవల శోభా శెట్టి బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. తన బిగ్‌బాస్ ఫ్రెండ్స్ తేజ, అమర్‌దీప్, ప్రియాంక జైన్ తదితరులు ఈ వేడుకల్లో సందడి చేశారు.

ఈ సందర్భంగా చుట్టూ బెలూన్లతో గదిని అందంగా అలంకరించి శోభాతో కేక్ కట్ చేయించారు బిగ్ బాస్ ఫ్రెండ్స్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

కాగా వీళ్లందరూ తెలుగు బిగ్‌బాస్ ఏడో సీజన్‌లో సందడి చేశారు. పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచిన ఈ సీజన్ లో అమర్ దీప్ రన్నరప్ గా నిలిచాడు.




