Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nayanthara : నేరుగా ఓటీటీలో విడుదల కానున్న నయనతార సినిమా.. కారణం ఇదే..

లేడీ సూపర్ స్టార్ నయనతార వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది జవాన్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది నయన్. ఆమె నటించిన ఈ చిత్రం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక ఇప్పుడు ఆమె నటిస్తోన్న లేటేస్ట్ మూవీ టెస్ట్.

Nayanthara : నేరుగా ఓటీటీలో విడుదల కానున్న నయనతార సినిమా.. కారణం ఇదే..
Test Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 24, 2025 | 7:16 PM

లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ మూవీ టెస్ట్. ఇందులో మీరా జాస్మిన్, నటుడు మాధవన్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రలు పోషించారు. క్రికెట్ గేమ్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ 2024 జనవరిలో ప్రారంభమైంది. డైరెక్టర్ సుమన్ కుమార్ కథ అందించిన ఈ చిత్రానికి ఎస్. శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. శశికాంత్ దక్షిణ భారతదేశంలోని ప్రముఖ నిర్మాతలు, వ్యాపారవేత్తలలో ఒకరు. విక్రమ్ వేద, జగమే తంత్రం, ఫైనల్ రౌండ్, మండేలా వంటి సినిమాలు నిర్మించిన శశికాంత్..టెస్ట్ మూవీతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. వైఎన్‌ఓటీ స్టూడియోస్‌ పతాకంపై చక్రవర్తి రామచంద్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా విడుదలకు సంబంధించిన సమాచారం ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. టెస్ట్ మూవీని నెట్‌ఫ్లిక్స్ OTTలో ఏప్రిల్ లేదా మేలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రంలో నటుడు సిద్ధార్థ్ క్రికెటర్‌గా నటిస్తుండగా, నటుడు మాధవన్ క్రికెట్ టీమ్ కోచ్‌గా నటిస్తున్నారు. ఇందులో నయనతార కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు శక్తి శ్రీ గోపాలన్ సంగీతం అందించారు.

దర్శక-నిర్మాత శశికాంత్ నిర్మించిన జగమే తంత్రం థియేటర్లలో కాకుండా నేరుగా OTTలో విడుదల కాగా, ఈ చిత్రం కూడా ఏప్రిల్ లేదా మేలో OTTలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రం తరువాత, నటి నయనతార తెలుగులో టాక్సిక్, మలయాళంలో డియర్ స్టూడెంట్, తమిళంలో మన్నంగ్‌కట్టి, రక్కై, మూక్కుట్టి అమ్మన్ 2 వంటి అనేక చిత్రాలకు సంతకం చేసింది. 2025లో టెస్ట్, టాక్సిక్, డియర్ స్టూడెంట్, రక్కై వంటి 4 చిత్రాలు విడుదల కానున్నాయని టాక్.

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?

Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..