Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movies: మోదీ మెచ్చిన ది స‌బ‌ర్మతి రిపోర్ట్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడ చూడొచ్చంటే..

టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా ఇప్పుడు హిందీ చిత్రపరిశ్రమలో దృష్టి సారించింది. ఇన్నాళ్లు తెలుగులో వరుస సినిమాలతో అలరించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు అందిపుచ్చుకుంటుంది. ఇటీవల ఆమె నటించిన పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ది సబర్మతి రిపోర్ట్. ఇందులో 12th ఫెయిల్ మూవీ హీరో విక్రాంత్ మాస్సే నటించిన సంగతి తెలిసిందే.

OTT Movies: మోదీ మెచ్చిన ది స‌బ‌ర్మతి రిపోర్ట్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడ చూడొచ్చంటే..
Pm Modi The Sabarmati Report
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 25, 2025 | 2:12 PM

గుజరాత్ అల్లర్లు, గోద్రా రైలు దహనకాండను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన సినిమా ది సబర్మతి రిపోర్ట్. హిందీలో ఈ చిత్రాన్ని డైరెక్టర్ ధీరజ్ శర్నా రూపొందించగా.. ఈ మూవీలో 12th ఫెయిల్ మూవీ ఫేమ్ విక్రాంత్ మాస్సే హీరోగా నటించాడు. అలాగే ఇందులో రిథి దిగ్రా, రాశి ఖన్నా కీలకపాత్రలు పోషించారు. గతేడాది నవంబర్ 15న థియేటర్లలో విడుదలైన ఈసినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా రిలీజ్ కంటే ముందే దేశ ప్రధాని ఈ మూవీపై ప్రశంసలు కురిపించారు. 2002లో గుజరాత్ లో గోద్రా రైలు దహనకాండ దేశాన్ని కలచివేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో దాదాపు 59 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా.. ఎంతో ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ఘటనను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన ఈ సినిమా గురించి ప్రధాని మోదీ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ది సబర్మతి రిపోర్ట్ సినిమాను ప్రతి ఒక్కరు తప్పక చూడాలని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. కల్పిత కథనాలు పరిమితకాలమే కొనసాగుతాయని.. సామాన్యులకు అర్థమయ్యే రీతిలో వాస్తవాలు వెలుగులోకి తీసుకువస్తున్నందుకు సంతోషంగా ఉందంటూ ప్రధాని మోదీ రిప్లై ఇచ్చారు. అనంతరం కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, ఇతర మంత్రులతో కలిసి పార్లమెంట్ ప్రాంగణంలో ప్రధాని మోదీ ఈ సినిమాను వీక్షించారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో ఈ సినిమా అందుబాటులోకి వచ్చేసింది.

ఇక తాజాగా శుక్రవారం నుంచి ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషలలో స్ట్రీమింగ్ చేస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం ఈ సినిమాను తెలుగులో జీ5 ఓటీటీలో చూడొచ్చు. ది సబర్మతి రిపోర్ట్ సినిమాను బాలాజీ మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై ఏక్తా కపూర్, శోభా కపూర్ నిర్మించారు.

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?

Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..