AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబోయ్..! ఈ హీరోయిన్ ఆమేనా..!! అందాల బొమ్మను ఇలా మార్చేశారా..

చాలా మంది ముద్దుగుమ్మలు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. గ్లామర్ పాత్రలు మాత్రమే కాదు అవకాశం వస్తే ఎలాంటి పాత్ర అయినా చేస్తున్నారు. ఇక పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ను గుర్తుపట్టారా. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆమె పేరే వినిపిస్తుంది. ఆ అందాల భామ ఎవరో గుర్తుపట్టారా.?

బాబోయ్..! ఈ హీరోయిన్ ఆమేనా..!! అందాల బొమ్మను ఇలా మార్చేశారా..
Actress
Rajeev Rayala
|

Updated on: Jan 25, 2025 | 1:41 PM

Share

ఈమధ్య హీరోయిన్స్ హీరోలతో సమానంగా పోటీ పడి మరీ నటిస్తున్నారు. గ్లామర్ తో పాటు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇక కథలను కూడా అలానే ఎంచుకుంటున్నారు. అలాగే సినిమాల కోసం ఎలాంటి లుక్ లోకైనా మారిపోతున్నారు కొందరు హీరోయిన్స్. అలాంటి హీరోయిన్స్ లో పైన కనిపిస్తున్న ముద్దుగుమ్మ ఒకరు. తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఆమె. ఇక పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ను గుర్తుపట్టారా. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆమె పేరే వినిపిస్తుంది. ఆమె వీడియోనే కనిపిస్తుంది. తన అందంతో ప్రేక్షకులను కవ్విస్తుంది ఆ బ్యూటీ. అలాగే నటనతోనూ ఈ అమ్మడు తోపే.. ఇంతకూ ఆమె ఎవరో కనిపెట్టారా.?

ఆమె కేవలం నటి మాత్రమే కాదు నిర్మాత కూడా.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది ఆమె. ఎవరో గుర్తుపట్టారా.? అందానికి కేరాఫ్ అడ్రస్ ఆమె.. పై ఫొటోలో ఉన్న నటి ఎవరో కాదు మలయాళ ముద్దుగుమ్మ మంజు వారియర్. తన 16వ ఏట 1995లో సాక్ష్యం అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మలయాళ ఇండస్ట్రీలో ఆమె ఎన్నో సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే ఎన్నో అవర్స్ కూడా అందుకుంది. ఏ పళయుం కదన్ను సినిమాలోని నటనకుగానూ మంజు కేరళ రాష్ట్ర ఉత్తమ సినీ నటి పురస్కారం లభించింది. ఆ తరువాత ఆమె వరసగా నాలుగు సార్లు ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం గెలుచుకుంది ఈ అందాల భామ.

తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఆమె. కాగా పైన కనిపిస్తున్న ఫోటో ఆమె నటించిన అసురన్ సినిమాలోది. ధనుష్ హీరోగా నటించిన అసురన్ సినిమాలో ఆమె అద్భుతంగా నటించింది. ఈ సినిమాలో ధనుష్ భార్యగా కనిపించింది మంజు. వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక రీసెంట్ గా సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న వెట్టయన్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఓ సాంగ్ లో మంజు తన స్టెప్పులతో ఆకట్టుకుంది.  ఎక్కడ చూసిన ఈ సాంగే కనిపిస్తుంది. మంజు స్టెప్పులు ఇన్ స్టాలో రీల్స్ గా వైరల్ అవుతుంది. ఇక రీసెంట్ గా విజయ్ సేతుపతి విడుదల 2 లో నటించింది మంజు వారియర్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..