AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్వ్కాడ్‌లో చోటు.. ఒక్క మ్యాచ్ కూడా ఆడించలే.. ప్రపంచకప్ విన్నర్‌పై ఇంత కోపమేలా గంభీర్, అయ్యర్..?

India vs New Zealand T20: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ను భారత్ విజయంతో ముగించినా.. ఓ ఆటగాడికి ఒక్క మ్యాచ్‌లోనూ అవకాశం ఇవ్వకపోవడంపై చర్చ మొదలైంది. టీ20 ప్రపంచకప్ విజేత జట్టులో సభ్యుడైన స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మొత్తం సిరీస్‌లో బెంచ్‌కే పరిమితమయ్యాడు. సిరీస్ గెలిచిన తర్వాత కూడా అతడిని తుది జట్టులోకి తీసుకోకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.

స్వ్కాడ్‌లో చోటు.. ఒక్క మ్యాచ్ కూడా ఆడించలే.. ప్రపంచకప్ విన్నర్‌పై ఇంత కోపమేలా గంభీర్, అయ్యర్..?
Ind Vs Nz Kuldeep Yadav
Venkata Chari
|

Updated on: Nov 02, 2026 | 8:18 AM

Share

India vs New Zealand T20: న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ తొలి మూడు మ్యాచ్‌లను గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది. అయితే ఈ విజయాల మధ్య జట్టు ఎంపికపై కొన్ని ప్రశ్నలు కూడా తలెత్తాయి. ముఖ్యంగా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav)కు ఒక్క మ్యాచ్‌లోనూ అవకాశం రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.

టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో భాగమైన కుల్దీప్.. న్యూజిలాండ్ పర్యటన కోసం ఎంపిక చేసిన 16 మంది సభ్యుల జట్టులో ఉన్నాడు. విదేశీ పిచ్‌లపై తన స్పిన్‌తో ప్రభావం చూపుతాడని అభిమానులు భావించారు. అయితే సిరీస్ మొదటి మ్యాచ్‌ నుంచి చివరి మ్యాచ్‌ వరకు అతడికి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కలేదు.

ఎక్కువమంది చదివినది: 16 ఓవర్లు.. 180 పరుగులు.. టీ20 చరిత్రలోనే చెత్త రికార్డులో టీమిండియా తోపు..!

ఇవి కూడా చదవండి

సిరీస్ ఇప్పటికే భారత్ చేతిలోకి వచ్చిన తర్వాత కూడా తుది జట్టులో మార్పులు చేసే అవకాశం ఉంది. అలాంటి సమయంలోనూ కుల్దీప్‌ను ఆడించకపోవడం అభిమానులకు ఆశ్చర్యం కలిగించింది.

ఆల్‌రౌండర్లకు ప్రాధాన్యమే కారణమా?

కుల్దీప్‌కు అవకాశం రాకపోవడానికి జట్టు కూర్పే ప్రధాన కారణంగా కనిపించింది. బ్యాటింగ్‌లో ఎనిమిదో స్థానంలో కూడా లోతు ఉండేలా జట్టు ఎంపిక చేయాలనే వ్యూహంతో స్పెషలిస్ట్ స్పిన్నర్ కంటే ఆల్‌రౌండర్లకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది.

అక్షర్ పటేల్ (Axar Patel)తో పాటు నమన్ ధీర్ (Naman Dhir) వంటి ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం వల్ల కుల్దీప్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. న్యూజిలాండ్‌లోని చిన్న మైదానాలను దృష్టిలో పెట్టుకుని బ్యాటింగ్ బలాన్ని పెంచుకోవాలనే ఆలోచనతో ఈ కూర్పును కొనసాగించినట్లు సోర్స్‌లో పేర్కొంది.

ఎక్కువమంది చదివినది: ఒక్క మ్యాచ్‌లో హిట్.. 4 మ్యాచ్‌ల్లో ఫట్.. అవసరమంటవా గంభీర్.. ఏకిపారేస్తోన్న ఫ్యాన్స్..!

అయితే కుల్దీప్ వంటి మ్యాచ్ విన్నింగ్ స్పిన్నర్‌ను పూర్తిగా పక్కన పెట్టడం సరైన నిర్ణయమేనా? అనే చర్చ ఇప్పుడు మొదలైంది.

దేశవాళీ క్రికెట్‌లో ఆడితే బాగుండేదా?

మరోవైపు, మొత్తం పర్యటనలో బెంచ్‌కే పరిమితమయ్యే పరిస్థితి ఉంటే కుల్దీప్‌ను దేశవాళీ క్రికెట్‌లో ఆడేందుకు అనుమతించాల్సిందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ లేదా రంజీ ట్రోఫీలో ఆడితే మ్యాచ్ ప్రాక్టీస్ కొనసాగించే అవకాశం ఉండేది.

ఇప్పటికే సిరీస్ ముగియడంతో కుల్దీప్‌కు ఒక్క మ్యాచ్ కూడా దక్కలేదు. దీంతో అతడి ఎంపిక, జట్టు కూర్పుపై సోషల్ మీడియాలో అభిమానుల చర్చ కొనసాగుతోంది. భారత జట్టు భవిష్యత్ టీ20 ప్రణాళికల్లో కుల్దీప్‌కు ఎలాంటి పాత్ర ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us