- Telugu News Photo Gallery Cinema photos Actress aditi shankar shared her latest black color dress photos
భైరవం బ్యూటీ భలే ఉందే.. అదితి శంకర్ లేటెస్ట్ ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి..
స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిన్నది నటిగా, నిర్మాతగా, అలాగే గాయినిగాను చాలా ఫెమస్ అయ్యింది. ఇక ఈ బ్యూటీ తెలుగు, తమిళ్ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఆతర్వాత మరోసారి అక్కినేని హీరో అఖిల్ టైహో జతకట్టింది.
Updated on: Jan 25, 2025 | 2:29 PM

స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిన్నది నటిగా, నిర్మాతగా, అలాగే గాయినిగాను చాలా ఫెమస్ అయ్యింది. ఇక ఈ బ్యూటీ తెలుగు, తమిళ్ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

హీరో కార్తీ నటించిన తమిళ చిత్రం విరుమాన్ సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. అలాగే నటన పరంగా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.

అలాగే శివకార్తికేయన్ హీరోగా నటించిన మహావీరన్ సినిమాలోనూ హీరోయిన్ గా చేసింది. ఈ సినిమానే తెలుగులో మహావీరుడుగా రిలీజ్ అయ్యింది. కానీ ఈ సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు భైరవం అనే సినిమాతో రాబోతుంది.

టాలీవుడ్ యంగ్ హీరోలు, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది అదితి శంకర్. కాగా సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది.

తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. బ్లాక్ కలర్ డ్రస్ లో మైండ్ బ్లాక్ చేసింది ఈ అమ్మడు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. భైరవం బ్యూటీ భలే ఉందే.. అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.




