- Telugu News Photo Gallery Cinema photos Actress nidhi agarwal interesting comments on prabhas raja saab
ప్రభాస్ సినిమా తర్వాత నా మీద మీ ఒపీనియన్ మారిపోతుంది: నిధి అగర్వాల్
నిధి అగర్వాల్.. ప్రస్తుతం రెండు బడా సినిమాల్లో హీరోయిన్ గా చేస్తుంది. ఈ అమ్మడు ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ఒకే ఒక్క హిట్ అందుకుంది. సవ్యసాచి సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. కానీ ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆతర్వాత మరోసారి అక్కినేని హీరో అఖిల్ తో జతకట్టింది.
Updated on: Jan 25, 2025 | 2:37 PM

నిధి అగర్వాల్.. ప్రస్తుతం రెండు బడా సినిమాల్లో హీరోయిన్ గా చేస్తుంది. ఈ అమ్మడు ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ఒకే ఒక్క హిట్ అందుకుంది. సవ్యసాచి సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. కానీ ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.

ఆతర్వాత మరోసారి అక్కినేని హీరో అఖిల్ తో జతకట్టింది. అఖిల్ హీరోగా నటించిన మిస్టర్ మజ్ను సినిమాలో హీరోయిన్ గా చేసింది కానీ ఈ సినిమా కూడా దారుణంగా నిరాశపరిచింది. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో అమ్మడి కెరీర్ కష్టమే అని అనుకున్నారు కొందరు.

కానీ అదే టైం లో గ్లామర్ గేట్లు ఎత్తేసింది ఈ భామ. పూరిజగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ హిట్ అందుకుంది. ఈ సినిమాలో నటనతో పాటు తన అందంతోనూ ప్రేక్షకులను కవ్వించింది ఈ వయ్యారి. ఆతర్వాత తిరిగి ఫ్లాప్స్ పలకరించాయి.

వరుస ఫ్లాప్స్ తో సతమతం అవుతున్న ఈ అమ్మడు ఇప్పుడు రెండు బడా సినిమాలను లైనప్ చేసింది. వాటిలో ఒకటి ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజా సాబ్, మరొకటి హరిహరవీరమల్లు. తాజాగా నిధి ప్రభాస్ సినిమా గురించి మాట్లాడుతూ..

ప్రేక్షకులు ఎక్కువగా నా నుంచి గ్లామర్ పాత్రలు ఆశిస్తారు. నేను కూడా అలాంటి పాత్రలే ఎక్కువగా చేస్తానని భావిస్తారు. రాజాసాబ్‌తో ప్రజలు నాపై ఉన్న ఈ అభిప్రాయాన్ని మార్చుకుంటారని చెప్పుకొచ్చింది. రాజాసాబ్ సినిమాలో నా పాత్ర అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇందులో నా పాత్రను ప్రేక్షకులు ఊహించలేరు అని చెప్పుకొచ్చింది నిధి అగర్వాల్.





























