AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema: ఓటీటీలో సంచలనం సృష్టిస్తోన్న కామెడీ సినిమా.. ట్రెండింగ్‏లో టాప్.. ఎక్కడ చూడొచ్చంటే..

ఎలాంటి ప్రమోషన్స్, హడావిడి లేకుండానే థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సినిమాలు చాలా ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని.. ఆ తర్వాత ఓటీటీలోనూ దూసుకుపోయిన చిత్రాల గురించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఒక చిన్న కామెడీ మూవీ ఓటీటీలో దూసుకుపోతుంది. ఇంతకీ ఏ సినిమా గురించి మాట్లాడుతున్నామో తెలుసా.. ?

Cinema: ఓటీటీలో సంచలనం సృష్టిస్తోన్న కామెడీ సినిమా.. ట్రెండింగ్‏లో టాప్.. ఎక్కడ చూడొచ్చంటే..
Maareesan Movie
Rajitha Chanti
|

Updated on: Aug 23, 2025 | 6:59 AM

Share

ప్రస్తుతం ఓటీటీలో దూసుకుపోతున్న ఈ కామెడీ సినిమా గురించి తెలుసా..? ఎలాంటి ప్రమోషన్స్, హడావిడి లేకుండానే అడియన్స్ ముందుకు వచ్చింది. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఓటీటీలోనూ దూసుకుపోతుంది. ఆ సినిమా మరెదో కాదండి.. పుష్ప విలన్ ఫహద్ ఫాసిల్ నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘మారిసన్’ . ఇటీవలే ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ట్రెండింగ్ నంబర్ వన్ లో దూసుకుపోతుంది. తమిళంలో రూపొందించిన ఈ సినిమా జూలై 26న థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద రూ.6 కోట్లు వసూలు చేసింది. ఇక ఇప్పుడు ఓటీటీలో భారీ స్పందన వస్తుంది.

ఇవి కూడా చదవండి : Actress : ఒకప్పుడు తోపు హీరోయిన్.. ఇప్పుడు 5 కంపెనీలకు యజమాని.. రూ.2000 కోట్ల ఆస్తులు.. ఎవరంటే..

‘మారిసన్’ చిత్రానికి సుధీర్ శంకర్ దర్శకత్వం వహించారు. ఫహద్ తో పాటు ఇందులో వడివేలు కీలకపాత్ర పోషించారు. వీరిద్దరి పాత్రల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. IMDbలో 7.8 రేటింగ్‌ను పొందిన ఈ సినిమాకు ఇప్పుడు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : Cinema : 26 రోజుల్లోనే 280 కోట్ల కలెక్షన్స్.. రికార్డ్ సృష్టించిన తొలి యానిమేటెడ్ సినిమా ఇది..

కథ విషయానికి వస్తే..

ఇందులో ఫహద్ ఫాసిల్ దయాళన్ అనే దొంగ పాత్రలో కనిపించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత వేలాయుధం పిళ్లై (వడివేలు) అనే వృద్ధుడిని కలుస్తాడు. వేలాయుధం పిళ్లై ధనవంతుడు. కానీ మతిమరుపు సమస్యతో బాధపడుతుంటాడు. అతడిని తన బైక్ పై బంధువుల ఇంటివద్దకు తీసుకెళ్తానని దయాళన్ సహాయం చేసేందుకు ముందుకు వస్తాడు. ఆ తర్వాత ఇద్దరి ప్రయాణంలో ఎలాంటి మలుపులు వచ్చాయి..? అనేది సినిమా. ప్రతి క్షణం ఉత్కంఠ పెరుగుతుంది. అలాగే కొన్నిసార్లు నవ్వు, కొన్నిసార్లు ఉత్కంఠభరితమైన భావోద్వేగ క్షణాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.

ఇవి కూడా చదవండి : Cinema : రెండు గంటల సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ.. దెబ్బకు దద్దరిల్లిన బాక్సాఫీస్.. ఎక్కడ చూడొచ్చంటే..

Cinema: రూ.70 లక్షల బడ్జెట్.. 70 కోట్ల కలెక్షన్స్.. 460 రోజులు థియేటర్లలో రచ్చ చేసిన సినిమా..

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..