Hero Simbu: అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన హీరో శింబు.. సంక్రాంతి కానుకగా రాబోతున్న ‘ఈశ్వరన్’ ..

తమిళ హీరో శింబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'మానాడు'. ఈ సినిమాకు సుశీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సంక్రాంతి కానుకగా

Hero Simbu: అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన హీరో శింబు.. సంక్రాంతి కానుకగా రాబోతున్న 'ఈశ్వరన్' ..
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 12, 2021 | 1:30 PM

తమిళ హీరో శింబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఈశ్వరన్’. ఈ సినిమాకు సుశీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు చిత్రబృందం. దీంతో శింబు అభిమానులకు ఈ సంక్రాంతి చాలా స్పెషల్ ఫెస్టివల్ కానున్నట్లుగా తెలుస్తోంది. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన పక్కా కమర్షియల్ అంశాలతో ఈ సినిమా ఉండబోతుంది. దీంతో ఈ మూవీపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం శింబు, వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మానాడు చిత్ర షూటింగ్‏లో బిజీగా ఉన్నాడు. హౌస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత సురేష్ కామాక్షి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఫుల్ రాజకీయ నేపథ్యంలో ఈ సినిమా కొనసాగనుంది. అంతేకాకుండా ఇందులో శింబుకు జోడిగా కళ్యాణి ప్రియదర్శన్ నటిస్తోంది. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ మూవీ ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ పోస్టర్లకు మంచి స్పందన లభించింది. ఇక మానాడు చిత్ర మోషన్ పోస్టర్‏ను సంక్రాంతి పండగ రోజున విడుదల చేయడానికి చిత్రయూనిట్ సన్నహాలు చేస్తున్నాయి. ఈ విషయాన్ని ఆదివారం వెల్లడించారు మూవీ మేకర్స్. ఇక సంక్రాంతి రోజున శింబు నటించిన ఈశ్వరన్ సినిమా విడుదల కాబోతుండటంతో అభిమానులను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read: మెగా హీరో కొత్త సినిమా టైటిల్ అదేనా..? సరికొత్త పాత్రలో కనిపించనున్న సాయి ధరమ్ తేజ్.

అభిమానులను సర్‏ఫ్రైజ్ చేసిన మాస్ మహారాజా రవితేజ.. న్యూఇయర్ కానుకగా ‘ఖిలాడీ’ పోస్టర్ రిలీజ్..