మెగా హీరో కొత్త సినిమా టైటిల్ అదేనా..? సరికొత్త పాత్రలో కనిపించనున్న సాయి ధరమ్ తేజ్.
‘సోలో బతుకే సో బెటర్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యాడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్. కరోనా కారణంగా వాయిదా పడ్డ ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా శుక్రవారం విడుదల కానుంది. ఇదిలా ఉంటే...

Sai dharam tej plays ias officer role: ‘సోలో బతుకే సో బెటర్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యాడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్. కరోనా కారణంగా వాయిదా పడ్డ ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా శుక్రవారం విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ పూర్తికాకముందే సాయి ధరమ్ తేజ్ మరో కొత్త సినిమాకు సంతకం చేసిన విషయం తెలిసిందే. దేవకట్ట దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో సాయి ధరమ్ తేజ్ నటించనున్నాడు. ఈ సినిమా ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నాడని సమాచారం. అంతేకాదు చిత్ర యూనిట్ ఈ సినిమాకు ‘రిపబ్లిక్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. టైటిల్, సాయి ధరమ్ తేజ్ పాత్ర ఆధారంగా చూస్తుంటే ఈ సినిమాలో సమకాలిన అంశాలను ప్రస్తావించే అవకాశాలున్నట్లు అర్థమవుతోంది. ఇక దేవకట్ట గతంలో తెరకెక్కించిన ప్రస్థానం కూడా సామాజిక అంశంతో తెరకెక్కిన సినిమా అనే విషయం తెలిసిందే. ఇప్పటి వరకు యూత్‌ను ఆకట్టుకునే సినిమాల్లోనే నటించిన సాయి ధరమ్ తేజ్ తొలిసారి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించనున్నాడన్న మాట.