ఆ స్టార్ హీరోయిన్‌ను పెళ్లి చేసుకోమని వాళ్ల అమ్మ అడిగింది.. షాకింగ్ విషయం చెప్పిన జేడీ చక్రవర్తి
విలన్, హీరో, నిర్మాత, డైరెక్టర్, మ్యూజిక్ కంపోజర్.. ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు జేడీ చక్రవర్తి. నాగార్జున శివ సినిమాలో విలన్‌గా వెండితెరకు పరిచయమైన జేడీ ఆ తర్వాత హీరోగా సక్సెస్ అయ్యాడు. మనీ, మనీమనీ, గులాబి, బొంబాయి ప్రియుడు, ఎగిరే పావురమా, అనగనగా ఒక రోజు, నవ్వుతూ బతకాలిరా, ప్రేమకు స్వాగతం, హోమం ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు.

జేడీ చక్రవర్తి.. ఒకప్పుడు అమ్మాయిల డ్రీమ్ బాయ్ ఆయన. విలన్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోగా మారి సినిమాలు చేశాడు జేడీ చక్రవర్తి. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ఈ సీనియర్ హీరో. రామ్ గోపాల్ వర్మ మొదటి చిత్రం శివ సినిమాతో నటుడిగా పరిచయమయ్యాడు జేడీ చక్రవర్తి. ఆయన గడ్డంతోనే బాగా పాపులర్ అయ్యాడు. శివ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో తెలుగుతో పాటు తమిళంతో పాటు హిందీలో కూడా అవకాశాలు వచ్చాయి. కొంతకాలం విలన్ గా మెప్పించిన ఆయన ఆ తర్వాత సహాయక పాత్రల్లో నటించి మెప్పించాడు. వన్ బై టూ, మనీ మనీ, గులాబీ సినిమాలతో హీరోగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
జేడీ చక్రవర్తి నటించిన సత్య చిత్రం తెలుగు, హిందీ భాషలలో విడుదలై ఘనవిజయం సాధించింది. దాంతో ఆయన క్రేజ్ పెరిగింది. జేడీ చక్రవర్తి ఇటీవల వెబ్ సిరీస్ లోనూ నటించాడు. 2023లో దయ అనే వెబ్ సిరీస్ లోనూ నటించాడు. నటుడిగానే కాదు దర్శకుడిగా కూడా ఆయన తన ప్రతిభ చాటుకున్నాడు. హోమం, సిద్ధం, మనీ మనీ మోర్ మనీ, ఆల్ ది బెస్ట్ అనే సినిమాలకు దర్శకత్వం వహించాడు.
ఇదిలా ఉంటే గతంలో ఓ ఇంటర్వ్యూలో జేడీ చక్రవర్తి మాట్లాడుతూ ఓ స్టార్ హీరోయిన్ ను పెళ్లి చేసుకోవాలని తనను అడిగిందని తెలిపారు. ఆ హీరోయిన్ ఎవరో కాదు అతిలోక సుందరి శ్రీదేవి. జేడీ చక్రవర్తి మాట్లాడుతూ.. ఒకేసారి హీరోయిన్ మహేశ్వరి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మహేశ్వరి, శ్రీదేవి ఇద్దరూ రిలేటివ్స్.. నేను మహేశ్వరి వాళ్ళ ఇంటికి వెళ్ళగానే అక్కడ శ్రీదేవీ వాళ్ల అమ్మ ఉన్నారు. లోపల నుంచి ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి. నన్ను చూసి మా అమ్మాయిని పెళ్లి చేసుకో బాబు అని అడిగింది. అయితే ఆమె ఓ హెల్త్ ఇష్యుతో బాధపడుతున్నారు. ఆమె తలకు ఓ సర్జరీ జరిగింది. అయితే తలకు కుడివైపు చేయాల్సిన ఆపరేషన్ ఎడమ వైపు చేశారట. దాంతో ఆమె కొంచం మెంటల్‌గా డిస్టర్బ్ అయ్యింది. అందుకే అలా మా కూతుర్ని పెళ్లి చేసుకో బాబు అని అడిగారు. నిజానికైతే ఎగిరి గంతెయ్యాల్సిన విషయం అది.. కానీ ఆమె పరిస్థితి తెలిసి సైలెంట్ అయ్యాను అని తెలిపారు జేడీ చక్రవర్తి. ఈ కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి.

Jd Chakravarthy, Sridevi