01 April 2025
చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్.. ఇప్పుడు ఆ ఒక్క పాటతో సెన్సేషన్..
Rajitha Chanti
Pic credit - Instagram
ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేకుండా సినీరంగంలోకి అడుగుపెట్టింది. టిక్ టాక్ వీడియోస్, షార్ట్ ఫిల్మ్స్ ద్వారా సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకుంది.
ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. కానీ ఆమె చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్ అయ్యాయి.
అందం, అభినయంతో కుర్రకారును కట్టిపడేసింది. కానీ ఇప్పటివరకు ఆమె ఖాతాలో ఒక్క హిట్టు మాత్రం పడలేదు. అయినా క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు.
తాజాగా ఓ స్పెషల్ పాటతో నెట్టింట సెన్సేషన్ అయ్యింది. అలాగే నెట్టింట ఓ రేంజ్లో అందాలు ఆరబోస్తూ రచ్చ చేస్తుంది. ఆమె మరెవరో కాదు కేతిక శర్మ.
2021లో విడుదలైన రొమాంటిక్ సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది. ఈ మూవీ ప్లాప్ అయినప్పటికీ టాలీవుడ్లో వరుస ఆఫర్స్ అందుకుంది.
లక్ష్య, రంగ రంగ వైభవంగా, బ్రో వంటి సినిమాలతో అడియన్స్ ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయాయి.
కానీ సోషల్ మీడియాలో మాత్రం విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది. కేతిక చేతిలో ఇప్పుడు సినిమాలు లేవు. కానీ ఇటీవలే స్పెషల్ సాంగ్ చేసింది.
నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ సినిమాలో అదిదా సర్ ప్రైజు అంటూ స్పెషల్ సాంగ్ చేసి మరింత ఫేమస్ అయ్యింది. ప్రస్తుతం కేతిక ఆఫర్స్ కోసం చూస్తోంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్