అప్పట్లో టిక్ టాక్ వీడియోలతో ఫేమస్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
01 April 2025
Basha Shek
నిజం చెప్పాలంటే టిక్ టాక్ ద్వారానే ఎంతో మంది తమ ట్యాలెంట్ ను ప్రపంచానికి చాటి చెప్పారు. అందులో ఈ బ్యూటీ కూడా ఒకటి.
అప్పట్లో ఈ అందాల తార లిప్-సింకింగ్ వీడియోలు, డబ్ స్మాష్ కామెడీ, డ్యాన్స్ వీడియోలకు నెట్టింట మంచి క్రేజ్ ఉండేది.
టిక్ టాక్‌లో ఈ బ్యూటీ ఫాలోవర్ల సంఖ్య దాదాపు 1.1 మిలియన్లు ఉండేవారంటే ఇట్టే అర్థం చేసుకోవచ్చు తనకు ఉన్న క్రేజ్ ఎలాంటిదోనని.
టిక్ టాక్ వీడియోలతోనే ఫేమస్ అయిన ఈ ముద్దుగుమ్మ బుల్లితెరకు పరిచయమైంది. పలు టీవీ షోలకు యాంకర్ గా వ్యవహరించింది.
ఇప్పుడు ఏకంగా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది సొగసరి. ఆమె మరెవరో కాదు ఢీ షో ఫేమ్ దీపికా పల్లి.
ఇప్పటికే వాంటెడ్ పండుగాడు సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది దీపికా పిల్లి. అయితే ఇప్పుడు సోలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది.
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి పేరుతో సినిమాలో మరో యాంకర్ ప్రదీప్ మాచిరాజుతో స్క్రీన్ షేర్ చేసుకోనుందీ అందాల తార.
ఇప్పటికే షూటింగ్ తో పాటు అన్నిహంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక్కడ క్లిక్ చేయండి..