Viral Video: కానిస్టేబుల్ కొంపముంచిన భార్య రీల్స్ పిచ్చి..! ఎంత పని చేస్తివే రాములా…
ప్రస్తుతకాలంలో రీల్స్ పిచ్చి బాగా పెరిగిపోయింది. చిన్న, పెద్దా తేడా లేకుండా ఎవరుపడితే వారు, ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలోపోస్ట్ చేస్తున్నారు. తద్వారా ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ కానిస్టేబుల్ భార్య రీల్స్ పిచ్చి అతని ఉద్యోగానికే ఎసరు తెచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన చండీగఢ్‌లో జరిగింది. చండీగఢ్‌లోని సెక్టార్-20 గురుద్వారా చౌక్ వద్ద జీబ్రా క్రాసింగ్‌పై జ్యోతి అనే మహిళకు సంబంధించిన రీల్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా

ప్రస్తుతకాలంలో రీల్స్ పిచ్చి బాగా పెరిగిపోయింది. చిన్న, పెద్దా తేడా లేకుండా ఎవరుపడితే వారు, ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలోపోస్ట్ చేస్తున్నారు. తద్వారా ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ కానిస్టేబుల్ భార్య రీల్స్ పిచ్చి అతని ఉద్యోగానికే ఎసరు తెచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన చండీగఢ్‌లో జరిగింది.
చండీగఢ్‌లోని సెక్టార్-20 గురుద్వారా చౌక్ వద్ద జీబ్రా క్రాసింగ్‌పై జ్యోతి అనే మహిళకు సంబంధించిన రీల్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడం, ప్రజా భద్రతకు ముప్పు వంటి నేరాల కింద ఆమెపై కేసు నమోదైంది. జ్యోతి భర్త అజయ్ కుందు సెక్టార్-19 పోలీస్ స్టేషన్‌లో సీనియర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఇన్‌స్టాగ్రామ్ ఖాతానుంచే భార్య జ్యోతి డ్యాన్స్ వీడియోను పోస్ట్ చేయడంతో అజయ్ కుందును ఉద్యోగంనుంచి సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు.
మార్చి 20న సాయంత్రం జ్యోతి, ఆమె వదిన కలిసి సెక్టార్-32లోని ఒక ఆలయానికి దైవదర్శనం కోసం వెళ్లారు. దర్శనం పూర్తిచేసుకొని తిరిగి వస్తూ జ్యోతి తన వదిన పూజ సహాయంతో డ్యాన్స్ రీల్‌ను చిత్రీకరించింది. ట్రాఫిక్ జామ్‌ను పట్టించుకోకుండా జీబ్రాక్రాసింగ్‌పై ఒక పంజాబీ పాటకు నృత్యం చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో హెడ్ కానిస్టేబుల్ జస్బీర్ చండీగఢ్‌లోని సెక్టార్-34 పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై చండీగఢ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సెక్టార్-20లోని గురుద్వారా చౌక్, సెక్టార్-17లోని పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. వాటి ఆధారంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడం, ప్రజా భద్రతకు ప్రమాదం కలిగించడం వంటి నేరాల కింద జ్యోతి, పూజలపై కేసు నమోదు చేశారు.
వీడియో చూడండి:
चंडीगढ़: पुलिसकर्मी की पत्नी ने ज़ेबरा क्रॉसिंग पर बनाई रील, ट्रैफिक नियमों की उड़ाई धज्जियां; रोड पर लगा जाम
महिला के खिलाफ पुलिस ने FIR दर्ज की, हालांकि थाने में ही बेल दे दी गई. मामला सेक्टर-20 में गुरुद्वारा चौक के पास का है.#Chandigarh pic.twitter.com/l2j4fTYFGv
— Ishani K (@IshaniKrishnaa) March 27, 2025