Viral Video: ఓర్నీ.. మనుషులు కూడా ఇంత బుద్ధిగా తినరుగా..!
సాధారణంగా జంతువులు అడవుల్లో దొరికిన ఆహారం ఇష్టం వచ్చినట్టు తింటాయి. డెన్‌లలో ఉండే జంతువులైతే యజమాని ఆహారం తీసుకొచ్చి కింద వేస్తే తింటాయి. ఓ ఎలుగుబంటి తను డైనింగ్ టేబుల్‌మీద ఫుడ్ పెట్టుకొని తింటూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అబ్బ ఎంత బుద్ధిగా తింటోందో.. ఎవరు నేర్పారో కదా అంటూ ఆశ్చర్యపోతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రస్తుతం నెట్టింట ఓ ఎలుగుబంటికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ ఎలుగుబంటికి ఎక్కడో క్యాబేజీ దొరికింది. అయితే దాన్ని ఎలా అంటే అలా తినేయలేదు ఆ బేర్. చక్కగా దాన్ని తెచ్చుకొని ఓ చోట పర్యాటకులు కూర్చుని తినడానికి ఏర్పాటు చేసిన బెంచ్, టేబుల్ దగ్గరకు వచ్చి, తను తెచ్చుకున్న క్యాబేజీని నీట్‌గా టేబుల్‌పైన పెట్టుకొని బెంచ్‌మీద కూర్చుని చక్కగా తింటోంది. ఇంతలో అది గమనించిన ఓ వ్యక్తి దానికి క్యారెట్, ఇంకా కొన్ని దుంపలు తీసుకొచ్చి ఆ టేబుల్‌పైన పెట్టాడు. బేర్ వాటిని తినలేదు. దాంతో ఆ వ్యక్తి క్యారెట్ తీసి ఎలుగుబంటికి తినమని ఇచ్చాడు. అయితే ఎలుగుబంటి ఆ క్యారెట్‌ను అలా చూస్తూ… వాటిని తినీ తినీ బోర్‌కొట్టింది. నాకొద్దు.. క్యాబేజ్ బావుంది.. ఇదే తింటాను.. సారీ..అన్నట్టుగా ఓ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చి.. తను క్యాబేజ్ తినడంలో మునిగిపోయింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటివరకూ 3 మిలియన్లమందికి పైగా వీక్షించారు. 83 వేలమందికి పైగా లైక్ చేశారు. రకరకాలుగా కామెంట్లు చేశారు. మంచి మర్యాద తెలిసిన ఎలుగుబంటి అని కొందరు.. ఈ బేర్‌ను మా ఇంటికి విందుకు పిలవాలనుంది అని ఇంకొందరు కామెంట్లు చేశారు.
This bear has better table manners than most people pic.twitter.com/EExCAO8CHQ
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) March 29, 2025
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..