Covid-19 vaccine: అమెరికాకు 15.5 మిలియన్ల కరోనా వ్యాక్సిన్లు… డిసెంబర్ చివరి కల్లా మరో 4.5 మిలియన్ల టీకాలు…
కరోనా కారణంగా అమెరికా అతలాకుతలం అవుతోంది. లక్షలాది పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వేలల్లో కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాకు పెద్ద ఊరట లభించింది. దాదాపు 15.5 మిలియన్ల కరోనా వ్యాక్సిన్లు అమెరికాకు చేరుకున్నాయి.
కరోనా కారణంగా అమెరికా అతలాకుతలం అవుతోంది. లక్షలాది పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వేలల్లో కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాకు పెద్ద ఊరట లభించింది. దాదాపు 15.5 మిలియన్ల కరోనా వ్యాక్సిన్లు అమెరికాకు చేరుకున్నాయి. డిసెంబర్ చివరి నాటికి మరో 4.5 మిలియన్ల టీకాలు ఆ దేశానికి అందుబాటులోకి వస్తాయి.
ఫైజర్, మోడెర్నాకు ఆమోదం తెలుపడంతో….
కరోనా మరణాలు అధికంగా చోటు చేసుకుండడంతో అమెరికా ప్రభుత్వం అత్యవసర సమయంలో వినియోగించేందుకు ఫైజర్, మోడెర్నా టీకాలకు అనుమతిని ఇచ్చింది. దీంతో ఈ రెండు కంపెనీలకు చెందిన 20 మిలియన్ల టీకాలను అమెరికా ప్రజలకు అందుబాటులో ఉంచనున్నట్లు ఆ దేశ కరోనా టీకా పంపిణీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న పెర్నా తెలిపారు. కాగా త్వరలో కరోనా టీకాను అమెరికా ప్రజలకు వేయనున్నారు. ఈ నేపథ్యంలోనే యూఎస్ ఆర్మీ సైతం వ్యాక్సిన్ పంపిణీలో పాలుపంచుకుంటోంది.