Corona vaccine: అమెరికాలో పది లక్షల మందికి కరోనా వ్యాక్సిన్… ప్రకటించిన సీడీసీ….

అమెరికాలోని పది లక్షల మందికిపైగా కరోనా టీకా అందించినట్లు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ డైరెక్టర్ రాబర్ట్ రెడ్‌ఫీల్డ్ తెలిపారు.

Corona vaccine: అమెరికాలో పది లక్షల మందికి కరోనా వ్యాక్సిన్... ప్రకటించిన సీడీసీ....
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 24, 2020 | 8:21 AM

అమెరికాలోని పది లక్షల మందికిపైగా కరోనా టీకా అందించినట్లు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ డైరెక్టర్ రాబర్ట్ రెడ్‌ఫీల్డ్ తెలిపారు. అమెరికా చరిత్రలో ఇదో అరుదైన రోజు అని అన్నారు. దేశ వ్యాప్తంగా పది లక్షల మందికి పైగా కరోనా మొదటి డోస్ టీకాను అందించినట్లు ప్రకటించారు. డిసెంబర్ నెల చివరి లోపు మరో 10 మిలియన్ల ప్రజలకు టీకా అందించే ప్రయత్నం చేస్తామని రాబర్ట్ తెలిపారు. అయితే కరోనా టీకా అందరికి అందించే వరకు ప్రతీ ఒక్కరు మాస్కు, కరోనా నిబంధనలను పాటించాలని కోరారు. మొదటి డోస్ టీకాను తీసుకున్న వారికి వ్యాధి నిరోధక టీకాలను త్వరలో అందిస్తామని అన్నారు.