అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘దయాగుణం’.. తన వియ్యంకుడితో సహా మొత్తం 28 మందిని క్షమించేశారు..వాళ్ళు నేరస్థులు కారట తన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన దయాగుణాన్ని చాటుకున్నారు. మొత్తం 28 మందిని క్షమించేశారు. వీరిలో తన అల్లుడు జేర్డ్ కుష్ణర్ తండ్రి చార్లెస్ కుష్ణర్, తన మాజీ ప్రచార మేనేజర్ పాల్ మాన్ ఫోర్ట్, తన మాజీ సహచరుడు రోజర్ స్టోన్ వంటివారున్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 'దయాగుణం'..  తన వియ్యంకుడితో సహా మొత్తం 28 మందిని క్షమించేశారు..వాళ్ళు నేరస్థులు కారట  తన
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Dec 24, 2020 | 9:14 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన దయాగుణాన్ని చాటుకున్నారు. మొత్తం 28 మందిని క్షమించేశారు. వీరిలో తన అల్లుడు జేర్డ్ కుష్ణర్ తండ్రి చార్లెస్ కుష్ణర్, తన మాజీ ప్రచార మేనేజర్ పాల్ మాన్ ఫోర్ట్, తన మాజీ సహచరుడు రోజర్ స్టోన్ వంటివారున్నారు. ముఖ్యంగా గతంలో  చార్లెస్ కుష్ణర్ చేసిన నేరాలు ఇన్నీఅన్నీ కావు. 2004 లో తన బావకు  వ్యభిచారిని ‘ఏర్పాటు’ చేసి..వీడియో తీయడమే కాకుండా అతడిని బ్లాక్ మెయిల్ చేస్తూ వచ్చాడట. మరికొన్ని నేరాలకు గాను రెండేళ్ల పాటు  జైలుశిక్ష కూడా ఆయన అనుభవించాడు. అయితే 2014 నుంచి అతడికి, ట్రంప్ కు మధ్య మళ్ళీ సాన్నిహిత్యం ఏర్పడింది. చార్లెస్ కుష్ణర్ మళ్ళీ ‘బుధ్ది మంతుడిగా’ మారిపోయాడు. ఇక లోగడ తన ఎన్నికల ప్రచారం సందర్భంగా తనను బురిడీ కొట్టించ యత్నించిన మాజీ ప్రచార మేనేజర్ పాల్ మాన్ ఫోర్ట్ ని కూడా ట్రంప్ క్షమించాడు. పాల్ క్షమాపణ చెప్పడంతో ఆయన మీదా దయాగుణం చూపాడు.

అల్లుడు జేర్డ్ కుష్ణర్ నిన్న తన మామగారు. అత్త మెలనియా ట్రంప్ తో కలిసి క్రిస్మస్ సెలవులకు బయలుదేరుతుండగా ట్రంప్ ఇదే సందర్భంలో వీరందరినీ క్షమిస్తున్నట్టు ప్రకటించాడు. కోట్లాది అమెరికన్లు కరోనా వైరస్ బాధపడుతుండగా వారికి సహాయపడేందుకు ఉద్దేశించిన భారీ ప్యాకేజీ బిల్లును ఆమోదించకుండా  తిరస్కరించి తన అమానుషాన్ని చాటుకున్న ట్రంప్…. ఈ నేరస్థులు, తన చాప కింద గొయ్యి తీసినవారిపట్ల మాత్రం ఇలా క్షమా గుణం చూపడం విడ్డూరం, (ఈ బిల్లును అమెరికా కాంగ్రెస్ ఆమోదించింది కూడా).