చిన్నారిని ముద్దుచేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడీ హీరోయిన్ క్రేజ్ ఖండంతరాలు దాటింది..
సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత సెలబ్రిటీలు నెట్టింట తెగ సందడి చేస్తున్నారు. ఒకప్పుడు కేవలం తమ వృత్తిపరమైన విషయాలను మాత్రమే పంచుకునే తారలు ఇప్పుడు వ్యక్తిగత విశేషాలను సైతం అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. ఇష్టాలను, అభిరుచులను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు...
సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత సెలబ్రిటీలు నెట్టింట తెగ సందడి చేస్తున్నారు. ఒకప్పుడు కేవలం తమ వృత్తిపరమైన విషయాలను మాత్రమే పంచుకునే తారలు ఇప్పుడు వ్యక్తిగత విశేషాలను సైతం అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. ఇష్టాలను, అభిరుచులను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. చివరికి తమ సంతానాన్ని కూడా అభిమానులకు చూపిస్తూ మురిసిపోతున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా ఓ అందాల తార పోస్ట్ చేసిన ఫొటో నెట్టింట తెగ వైర్ అవుతోంది. పైన కనిపిస్తున్న ఫొటోలో చిన్నారిని ముద్దు చేస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా.? తన అద్భుత నటన ప్రతిభతో భారత దేశం గర్వించే స్థాయికి ఎదిగిందీ బ్యూటీ. అందం, అభినయం కలగలిపిన ఈ చిన్నది ఏకంగా మిస్ వరల్డ్ అవార్డును సైతం సొంతం చేసుకుంది. బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన ఈ బ్యూటీ హాలీవుడ్‌లోనూ తన సత్తా చాటింది. చివరికి అమెరికాకు చెందిన వాడిని పెళ్లి చేసుకొని అక్కడ స్థిరపడింది. ప్రస్తుతం హాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది.
ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరనే విషయంలో మీకో క్లారిటీ వచ్చేసింది కదూ.! అవును మీరు అనుకుంటోంది నిజమే. ఈ హీరోయిన్ మరెవరో కాదు గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా. అమెరికా పాప్ సింగర్ నిక్ జోనస్‌ను వివాహామాడిన ఈ చిన్నది ఇటీవల సరోగసి విధానంలో ఓ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం భర్త, చిన్నారితో సంతోషంగా గడుపుతోన్న ప్రియాంక ఫ్యామిలీతో దిగిన ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా తన గారాల పట్టిని ఆడిస్తున్న సమయంలో తీసిన ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో భర్త నిక్ కూడా ఉన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తగ వైరల్ అవుతోంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..