Tollywood : 2700 కోట్ల ఆస్తులు.. బ్యాంక్ జాబ్ వదిలేసి హీరోయిన్గా ఎంట్రీ.. అయినా అద్దె ఇంట్లోనే..
నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టిన ఎంతో మంది సక్సెస్ అయ్యారు. అంతకుముందు విభిన్న రంగాల్లో సెటిల్ అయిన చాలా మంది ఆ తర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదువుకుంది. ఆ తర్వాత ముంబైలోని ఓ బ్యాంకులో ఉద్యోగం చేశారు. తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఆమె ఎవరో తెలుసా.. ?

పటౌడీ రాజకుటుంబానికి చెందిన అమ్మాయి. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసింది. ఆమె 2700 కోట్ల ఆస్తికి వారసురాలు. గ్రాడ్యుయేషన్ తర్వాత ముంబైలోని ఓ బ్యాంకులో నెల జీతం కోసం ఉద్యోగం చేసింది. ఇప్పటికీ అద్దె ఇంట్లోనే జీవనం కొనసాగిస్తుంది. ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్. ఆమె తల్లి పేరు షర్మిలా ఠాగూర్. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి మాస్టర్స్ డిగ్రీ పొందిన తర్వాత ముంబైలోని ఓ అంతర్జాతీయ బ్యాంకులో ఉద్యోగం చేసింది ఈ ముద్దుగుమ్మ. అప్పట్లో ఆమెకు సంవత్సరానికి రూ.2.2 లక్షల జీతం. అదే సమయంలో ఆమె లోఖండ్‌వాలాలో నెలకు రూ. 17,000 కి అద్దెకు ఓ ఇంట్లో ఉండేది.
ఇవి కూడా చదవండి : Cinema : ఓటీటీలో అదరగొడుతున్న కామెడీ థ్రిల్లర్.. 2 గంటలు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్..
ఇవి కూడా చదవండి : Tollywood: ఎంగేజ్మెంట్ క్యాన్సిల్.. హీరోలతో ఎఫైర్ రూమర్స్.. 42 ఏళ్ల వయసులో దుమ్మురేపుతోన్న హీరోయిన్..
సెలబ్రెటీ ఫ్యామిలీకి చెందిన సోహా.. ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఆమెకు వచ్చిన మొదటి మోడలింగ్ కాంట్రాక్ట్ కు రూ.5 లక్షలు పారితోషికం ఇచ్చారు. ఆ తర్వాత దిల్ మాంగే మోర్ సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది. ఈ చిత్రానికి రూ.10 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంది.
ఇవి కూడా చదవండి : OTT Movies: ఏం సినిమా గురూ ఇది.. కోర్టులో ఊహించని ట్విస్టులు.. ఓటీటీలో ఈ మూవీస్ చూస్తే..
సోహా అలీ ఖాన్.. బీటౌన్ హీరో,దేవర మూవీ విలన్ సైఫ్ అలీ ఖాన్ సోదరి. ఇన్నాళ్లు నటిగా అలరించిన సోహా.. ఇప్పుడు కొత్తగా వెల్‌నెస్ పాడ్‌కాస్ట్ ఆల్ అబౌట్ హర్‌ను ప్రారంభించింది. సెలబ్రెటీ ఫ్యామిలీకి చెందిన సోహా.. మొదట చదువుకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది.
ఇవి కూడా చదవండి : Nayanthara : ఆ సినిమా చేయడం జీవితంలోనే చెత్త నిర్ణయం.. నయనతార సంచలన కామెంట్స్..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Cinema : ఓటీటీలో అదరగొడుతున్న కామెడీ థ్రిల్లర్.. 2 గంటలు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్..







