AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ‘మహావతార్ నరసింహ’కు ఏమాత్రం తగ్గదు.. ఓటీటీలో ఈ యానిమేటెడ్ మూవీ చూశారా? ఐఎమ్‌డీబీలో 9.1 రేటింగ్

హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన యానిమేటెడ్ చిత్రం 'మహావతార నరసింహ' థియేటర్లలో ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మూవీ ఓటీటీ విడుదల కోసం ఆడియెన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే 'మహావతార నరసింహ'కు ఏ మాత్రం తగ్గకుండా ఒక యానిమేటెడ్ మూవీ ఓటీటీలో రికార్డులు సృష్టిస్తోంది.

OTT Movie: 'మహావతార్ నరసింహ'కు ఏమాత్రం తగ్గదు.. ఓటీటీలో ఈ యానిమేటెడ్ మూవీ చూశారా? ఐఎమ్‌డీబీలో 9.1 రేటింగ్
OTT Movie
Basha Shek
|

Updated on: Aug 27, 2025 | 12:12 PM

Share

హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ‘మహావతార్ నరసింహ’ అనే యానిమేటెడ్ సినిమా బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతోంది. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికే రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇలాంటి వసూళ్లు వస్తాయని బహుశా నిర్మాతలు కూడా ఊహించి ఉండరేమో! మహా విష్ణువు నాలుగో అవతారం నేపథ్యంతో తెరకెక్కిన ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాకు ఏ మాత్రం తగ్గకుండా ఒక మైథాలజీ యానిమేటెడ్ వెబ్ సిరీస్ OTTలో అందుబాటులో ఉంది. IMDBలో ఈ సిరీస్ కు 9.1/10 రేటింగ్ ఉండడం విశేషం. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ మొదటి సీజన్ 2021లో రిలీజ్ కాగా, ఇప్పటివరకు మొత్తం ఆరు సీజన్లు స్ట్రీమింగ్ కు వచ్చాయి.

ప్రస్తుతం ఓటీటీలో అత్యుత్తమ యానిమేటెడ్ సిరీస్‌గా ప్రశంసలు పొందిన ఈ వెబ్ సిరీస్ పేరు ‘ది లెజెండ్ ఆఫ్ హనుమాన్’. రామాయణం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్ మొత్తం హనుమంతుడి చుట్టూ తిరుగుతుంది. ఇప్పటివరకు ఈ సిరీస్ లో వచ్చిన అన్ని సీజన్స్ సూపర్ హిట్ గా నిలిచాయి. ఓటీటీలో రికార్డు వ్యూస్ తెచ్చకుకున్నాయి. మహావతార్ నరసింహా తరహాలో ‘ది లెజెండ్ ఆఫ్ హనుమాన్’ లోనూ విజువల్ ఎఫెక్ట్స్ హై రేంజ్ లో ఉన్నాయి. ఈ సిరీస్‌ను శరద్ దేవరాజన్, జీవన్ జె. కాంగ్ చారువి అగర్వాల్ రూపొందించారు ఆరు సీజన్లకు సూపర్బ్ రెస్పాన్స్ రావడడంతో ఈ వెబ్ సిరీస్ ఏడవ సీజన్ కోసం మేకర్స్ సన్నాహాలు ప్రారంభించారు. త్వరలోనే దీనిపై ఓ అప్డేట్ రానుంది.

ఇవి కూడా చదవండి

ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సిరీస్ లో ఇప్పటివరకు మొత్తం ఆరు సీజన్లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. అలాగే ఓవరాల్ గా 52 ఎపిసోడ్స్ అందుబాటులో ఉన్నాయి. మహావతార్ నరసింహా ఓటీటీలోకి వచ్చే వరకు ఈ సిరీస్ ను చూసేయండి మరి..

జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్.. తెలుగులోనూ చూడొచ్చు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..