Kangana Ranaut: స్టార్ కిడ్స్ పై కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్.. ఉడకబెట్టిన కోడిగుడ్లలా ఉంటారంటూ..

ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగనా.. మరోసారి బాలీవుడ్ సెలబ్రెటీ పిల్లల పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Kangana Ranaut: స్టార్ కిడ్స్ పై కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్.. ఉడకబెట్టిన కోడిగుడ్లలా ఉంటారంటూ..
Kangana Ranaut
Follow us
Rajitha Chanti

| Edited By: Ravi Kiran

Updated on: May 16, 2022 | 6:56 PM

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ (Kangana Ranaut) మరోసారి స్టార్ కిడ్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు… ప్రేక్షకులకు స్టార్స్ పిల్లలు కనెక్ట్ కాలేరని.. వారు ఉడకబెట్టిన గుడ్లలా కనిపిస్తారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ధాకడ్ సినిమా మే 20న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న కంగనా.. బాలీవుడ్ చిత్రాలకంటే దక్షిణాది సినిమాలు సూపర్ హిట్ కావడం పై స్పందించింది.. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగనా.. మరోసారి బాలీవుడ్ సెలబ్రెటీ పిల్లల పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్ పిల్లలు మాత్రమే ఎంట్రీ ఇస్తున్నారని.. వారి చదువుల కోసం విదేశాలకు వెళ్తారని.. అక్కడ వారు హాలీవుడ్ చిత్రాలను మాత్రమే చూస్తారని… కత్తి, ఫోర్క్ తో మాత్రమే తింటారని.. భిన్నంగా మాట్లాడతారు.. కాబట్టి వారు ప్రేక్షకులకు ఎలా కనెక్ట్ అవుతారని చెప్పుకొచ్చింది. వారి రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని.. ఉడకబెట్టిన గుడ్లలా కనిపిస్తారని.. కాబట్టి వారితో ప్రేక్షకులు కనెక్ట్ కాలేరంటూ తెలిపింది. అంతేకాకుండా.. దక్షిణాది చిత్రాలను చూసేందుకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడానికి గల కారణాన్ని వివరించింది… కంగనా మాట్లాడుతూ.. “దక్షిణాది చిత్రాలలో హీరోలు ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యేలా సినిమాలు చేస్తారు.. వారు ఏలాంటి పాత్రలలోనైనా నటించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.. ఉదాహరణకు ఇటీవల విడుదలైన పుష్ప సినిమాలో హీరో కూలీ వ్యక్తిగా కనిపించాడు. కానీ బీటౌన్ హీరోలు ఈ మధ్యకాలంలో అలాంటి పాత్రలు పోషించారా ? దక్షిణాది చిత్రాల్లో సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తారు.. అందుకే వారి చిత్రాలకు ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు.. ప్రస్తుతం కాలంలో ప్రేక్షకులతో సెలబ్రెటీలు కనెక్ట్ కావడం చాలా కష్టం” అన్నారు.

ఇవి కూడా చదవండి