Telugu Movies: ఓటీటీలో పాన్ ఇండియా చిత్రాల జోరు.. ఈ వారం థియేటర్లలో వచ్చే సినిమాలు ఇవే..

ఇప్పుడు థియేటర్లలో చిన్న చిత్రాల సందడి మొదలైంది. ఓవైపు బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవ్వగా..

Telugu Movies: ఓటీటీలో పాన్ ఇండియా చిత్రాల జోరు.. ఈ వారం థియేటర్లలో వచ్చే సినిమాలు ఇవే..
Rrr
Follow us
Rajitha Chanti

| Edited By: Ravi Kiran

Updated on: May 16, 2022 | 6:57 PM

థియేటర్లలో వరుసగా సూపర్ హిట్ చిత్రాలు విడుదలై ఆల్ టైమ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాయి. ఇప్పటివరకు పాన్ ఇండియా చిత్రాల హావా ఉండగా.. ఇక ఇప్పుడు థియేటర్లలో చిన్న చిత్రాల సందడి మొదలైంది. ఓవైపు బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవ్వగా.. మరోవైపు సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బ్లాక్ బస్టర్ సినిమాలు ఓటీటీలలో స్ట్రీమింగ్‏ కానున్నాయి. ఆర్ఆర్ఆర్… ఆచార్య వంటి హిట్ మూవీస్ ఈవారం ఓటీటీ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వనున్నాయి. మరీ ఈ వారం.. థియేటర్లలో.. ఓటీటీలలో సందడి చేయబోయే సినిమాలెంటో తెలుసుకుందామా…

శేఖర్.. సీనియర్ హీరో రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం శేఖర్. ఆయన సతీమణి జీవితరాజశేఖర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల (మే 20న) ప్రేక్షకుల ముందుకు రానుంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన జోసెఫ్ చిత్రానికి రీమెక్ గా శేఖర్ సినిమాలు తెరకెక్కించారు జీవితా రాజశేఖర్. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించగా.. వంకాయలపాటి మురళీకృష్ణ సమర్పణలో పెగాసస్ సినీకార్ప్, టారస్ సినీకార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ బ్యానర్లపై బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మించారు.

ధగడ్ సాంబ.. సంపూర్ణేష్ బాబు ప్రధాన పాత్రలో డైరెక్టర్ ఎన్ఆర్ రెడ్డి తెరకెక్కించిన సినిమా ధగడ్ సాంబ. ఇందులో సోనాక్షి కథానాయికగా నటించింది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ మే 20న థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో జ్యోతి, చలాకీ చంటి, మిర్చి మాధవి, ఆనంద్ భారతి తదితరులు నటించారు. కుటుంబమంతా కలిసి చూడదగిన చూసేలా కథా కథనాలు ఉంటాయన్నారు మేకర్స్.

ఇవి కూడా చదవండి

భూల్ భులాయా 2.. బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్.. గార్జియస్ బ్యూటీ కియారా అద్వాణీ జంటగా నటించిన చిత్రం భూల్ భులాయా 2. ఈ చిత్రానికి డైరెక్టర్ అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించారు. ఇందులో టబు కీలకపాత్రలో నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా మే 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ధాకడ్.. బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్.. డైరెక్టర్ రజనీష్ ఘయ్ కాంబోలో వచ్చిన లేటేస్ట్ చిత్రం ధాకడ్. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ మూవీలో కంగనా ఏజెంట్ అగ్ని పాత్రలో నటించింది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ మే 20 విడుదల కానుంది.

ఈవారం ఓటీటీలో రాబోయే చిత్రాలు.. ఆర్ఆర్ఆర్.. దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. పాన్ ఇండియా లెవల్లో దాదాపు రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డ్‏కెక్కింది.. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించగా.. బాలీవుడ్ స్టార్స్ అలియా భట్, అజయ్ దేవగణ్, శ్రియా శరన్, సముద్రఖని కీలకపాత్రలలో నటించారు. బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం జీ 5లో మే20న స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ చిత్రాన్ని T-VOD పద్ధతిలో అద్దె చెల్లించి చూడాల్సి ఉంటుంది.

ఆచార్య.. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా ఆచార్య. మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా ఇటీవలే విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్‍లో మే 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

భళా తందనాన.. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు… అందాల కేథరిన్ జంటగా నటించిన చిత్రం భళా తందనాన. డైరెక్టర్ దంతులూరి చైతన్య తెరకెక్కించిన ఈ సినిమా మే 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన రెండు వారాల్లోనే ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‏లో మే 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

పంచాయత్.. లాక్ డౌన్ సమయంలో విడుదలై ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అందించిన వెబ్ సిరీస్ పంచాయత్. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ సీజన్ 2 వచ్చేస్తుంది. అమెజాన్ ప్రైమ్ లో పంచాయత్ 2 సిరీస్ మే 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇందులో జితేంద్ర కుమార్, రఘువీర్ యాదవ్, నీనా గుప్తా ప్రధాన పాత్రలలో నటించారు..

12th మ్యాన్.. సీనియర్ హీరో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 12th మ్యాన్. డైరెక్టర్ జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫాం డిస్నీ ప్లస్ హట్ స్టార్ లో మే 20న విడుదల కానుంది.

జీ5.. జోంబ్లివీ.. మే 20.. హిందీ..

నెట్ ఫ్లిక్స్.. ది ఇన్విజబుల్ మ్యాన్..మే 16.. హాలీవుడ్ మూవీ.. ద హంట్.. మే 16.. హాలీవుడ్. వూకిల్డ్ సారా..వెబ్ సిరీస్.. మే 18

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?