F3 Movie: ఎఫ్‌3 స్పెషల్‌ సాంగ్‌ ప్రోమో వచ్చేసింది.. మరోసారి డ్యాన్స్‌తో అదరగొట్టిన బుట్ట బొమ్మ..

Narender Vaitla

Narender Vaitla | Edited By: Ravi Kiran

Updated on: May 16, 2022 | 6:58 PM

F3 Movie: వెంకటేష్‌ (Venkatesh), వరుణ్‌ తేజ్ (Varun Tej) హీరోలుగా తెరకెక్కిన చిత్రం 'ఎఫ్‌ 3'. 2019లో వచ్చిన 'ఎఫ్‌2' చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఫుల్‌లెంత్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ...

F3 Movie: ఎఫ్‌3 స్పెషల్‌ సాంగ్‌ ప్రోమో వచ్చేసింది.. మరోసారి డ్యాన్స్‌తో అదరగొట్టిన బుట్ట బొమ్మ..

Follow us on

F3 Movie: వెంకటేష్‌ (Venkatesh), వరుణ్‌ తేజ్ (Varun Tej) హీరోలుగా తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్‌ 3’. 2019లో వచ్చిన ‘ఎఫ్‌2’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఫుల్‌లెంత్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టడంతో సీక్వెల్‌ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు అనిల్‌ రావిపూడి ఎఫ్‌3పై మరింత దృష్టి సారించాడు. మరింత ఫన్‌ డోస్‌ను అందించేందుకు ఈసారి సునీల్‌ను కూడా రంగంలోకి దింపాడు.

ఇక క్యాస్టింగ్‌ విషయంలో భారీగా తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో అనిల్‌ రావిపూడి స్పెషల్‌ సాంగ్‌ను కూడా ప్లాన్‌ చేశాడు. పూజా హెగ్డే ఈ స్పెషల్‌ సాంగ్‌లో నటిస్తోంది. ‘లైప్‌ అంటే ఇట్టా ఉండాలా’ లిరిక్స్‌తో ఉన్న ఈ సాంగ్‌కు సంబంధించి చిత్ర యూనిట్ తాజాగా ప్రోమోను విడుదల చేసింది. ప్రోమోతోనే ఒక్కసారిగా సాంగ్‌పై అంచనాలు పెంచేశారు మేకర్స్‌. పూజా హెగ్డే చేసిన డ్యాన్స్‌ హైలట్‌గా నిలిచింది. వెంకీ, వరుణ్‌లో పోటీపోటీ స్టెప్పులు, పూజా అందం పాటకు హైలట్‌గా నిలిచాయి.

ఇక పూజా హెగ్డే గ్లామర్‌ కూడా సాంగ్‌కు మరింత హైప్‌ తెచ్చింది. రంగస్థలంలో ‘జిగేల్‌ రాణి’ పాటకు ఏ రేంజ్‌లో పేరు వచ్చిందో, ఈ సాంగ్‌తో కూడా అదే స్థాయిలో పేరు వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలా ఉంటే దిల్‌ రాజు సమర్పకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై శిరీష్‌ ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu