AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Human Library: ఈ లైబ్రరీలో మనుషులే పుస్తకాలు, అనుభవాలే పాఠాలు.. హ్యూమన్‌ లైబ్రరీ విశేషాలు..

Human Library: 'పుస్తకం ఒక మంచి స్నేహితుడితో సమానం' అంటారు. ఒక స్నేహితుడు ఎలాగైతే మనతో అన్ని విషయాలను పంచుకుంటాడో అలాగే పుస్తకం కూడా ఎన్నో అనుభూతులను అందిస్తుందని దాని అర్థం..

Human Library: ఈ లైబ్రరీలో మనుషులే పుస్తకాలు, అనుభవాలే పాఠాలు.. హ్యూమన్‌ లైబ్రరీ విశేషాలు..
Human Library
Narender Vaitla
|

Updated on: May 16, 2022 | 8:16 AM

Share

Human Library: ‘పుస్తకం ఒక మంచి స్నేహితుడితో సమానం’ అంటారు. ఒక స్నేహితుడు ఎలాగైతే మనతో అన్ని విషయాలను పంచుకుంటాడో అలాగే పుస్తకం కూడా ఎన్నో అనుభూతులను అందిస్తుందని దాని అర్థం. అయితే మనుషుల అనుభవాలు, అనుభూతులు, బాధలు, సంతోషాలు, విజయాలు, ఓటములు, గుణపాఠాలు వీటికి మించిన జీవిత సారం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి. అందుకే పుస్తకాలను చదవడం కంటే మనుషులను చదివేస్తే ఎంతో జ్ఞానాన్ని సొంతం చేసుకోవచ్చని కొందరు అభిప్రాయపడుతుంటారు. కొందరు తాము మనుషులను చదవడం వల్లే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకున్నాం అని చెబుతుంటారు. పుస్తకాలను చదవడానికి లైబ్రరీలు ఉంటాయి. మరి మనుషులను ఎక్కడ చదవాలనేగా మీ సందేహం. మనుషులను చదివే ఓ లైబ్రరీలు కూడా ఉన్నాయని మీకు తెలుసా.? అవును వాటి పేరు కూడా హ్యూమన్‌ లైబ్రరీనే.

స్టాప్‌ వయలెన్స్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు రోనీ అబెర్గెల్‌, అతడి సోదరుడు డాని, అస్మా మౌనా, క్రిస్టోఫర్‌ ఎరిక్సన్‌ అనే వ్యక్తులు 22 ఏళ్ల క్రితం డెన్మార్క్‌లో హ్యూమన్‌ లైబ్రరీ ఆర్గనేజేషన్‌ను ప్రారంభించారు. ఇందులో పుస్తకాలకు బదులు మనుషులను చదవొచ్చు. వారి జీవిత కథను 30 నిమిషాల పాటు వినొచ్చు. హ్యూమన్ లైబ్రరీల ముఖ్య ఉద్దేశం ‘డోంట్‌ జడ్జ్‌ ఏ బుక్‌ బై ఇట్స్‌ కవర్‌’ (పైన పైన విషయాలు చూసి ఏ అంచనాకు రావొద్దు). మీరు చదివిన విషయాలతో ఓ అంచనాకు రాకూడదని, వ్యక్తుల అపారమైన అనుభవాల గురించి ప్రత్యక్షంగా తెలుసుకున్న తర్వాత అవగాహనకు రావాలని వీటి ఏర్పాటు లక్ష్యంగా చెబుతున్నారు.

హ్యూమన్‌ లైబ్రరీ ఆర్గనైజేషన్‌ ప్రపంచవ్యాప్తంగా 85 దేశాల్లో బ్రాంచ్‌లను కలిగి ఉంది. ఆస్ట్రేలియాలో 2006లో తొలిసారి శాశ్వత హ్యూమన్‌ లైబ్రరీని ఏర్పాటు చేశారు. తమ జీవిత అనుభవాల గురించి ఇతరులకు చెప్పడానికి ఇష్టపడే వారు, విమర్శలను ఓపెన్‌ మైండ్‌తో అంగీకరించే వారు ఎవరైనా హ్యూమన్‌ లైబ్రరీ ఆర్గనైజేషన్‌లో వాలంటీర్లుగా చేరొచ్చు. మానసిక ఆరోగ్య సమస్యలున్న వారు, హెచ్‌ఐవీ రోగులు, స్వలింగ సంపర్కులు, లింగ మార్పిడి చేసుకున్న వారు ఇలా ఎవరైనా ఈ లైబ్రరీలో చేరొచ్చు.

ఇవి కూడా చదవండి

భారత్‌లోనూ హ్యూమన్‌ లైబ్రరీలు..

భారత దేశంలోనూ ఈ హ్యూమన్‌ లైబ్రరీలు ఏర్పాటు చేశారు. అందలీబ్‌ ఖురేషి తొలిసారి ఈ లైబ్రరీని పరిచయం చేశారు. కెమికల్‌ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఖురేషి ఇంటర్నేషనల్‌ టూర్‌లో భాగంగా హ్యూమన్‌ లైబ్రరీ గురించి తెలుసుకున్నారు. అనంతరం 2017లో కొంత మంది సామాజిక కార్యకర్తలతో కలిసి ముంబైలో ఈ లైబ్రరీని ఏర్పాటు చేశారు. ముంబై ప్రధాన కేంద్రంగా నడుస్తోన్న ఈ లైబ్రరీలు ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్‌, ఇండోర్‌ వంటి నగరాల్లో ఈ లైబ్రరీల కార్యక్రమాలు జరుగుతున్నాయి.