Beach Flyover: సముద్రపు అలలపై నడిచేద్దామా..! నీటిపై తేలియాడే వంతెన.. ఆకట్టుకుంటున్న వీడియో..
కరోనా మహమ్మారి దెబ్బకు వ్యాపార, వాణిజ్య సంస్థలే కాదు..పర్యాటకం కూడా కుదేలైపోయింది. పర్యాటక రంగాన్ని అభివృద్ది చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వినూత్న నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
కరోనా మహమ్మారి దెబ్బకు వ్యాపార, వాణిజ్య సంస్థలే కాదు..పర్యాటకం కూడా కుదేలైపోయింది. పర్యాటక రంగాన్ని అభివృద్ది చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వినూత్న నిర్ణయాలు తీసుకుంటున్నాయి. పర్యాటకులను ఆకర్షిచేందుకు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా కర్ణాటక ప్రభుత్వం సముద్రం నీటిపై తేలియాడే వంతెనను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చింది.కర్ణాటకలోని ఉడుపిలో నీటిపై తేలియాడే వంతెన ప్రారంభించారు స్థానిక ఎమ్మెల్యే రఘుపతి భట్. నగరంలోని మాల్పే బీచ్లో ఈ వంతెనను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడికి తరలివచ్చారు. తేలియాడే వంతెన వద్ద అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే రఘుపతి.. అధికారులను ఆదేశించారు. ఎల్లప్పుడూ 20-25 మంది గార్డ్స్ ఇక్కడ అందుబాటులో ఉండేలా చూడాలని నిర్వాహకులకు స్పష్టం చేశారు. రాష్ట్రంలో తొలి తేలియాడే వంతెన ఇదే కావడంతో ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. సముద్రపు అలల ధాటికి బ్రిడ్జి పైకి.. కిందకి కదలాడటం పర్యాటకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. సముద్రంలో 100 మీటర్ల దూరం వరకు ఈ బ్రిడ్జిపై నడుచుకుంటూ వెళ్లొచ్చు. దీనిపై వెళ్లేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు పర్యాటకులు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urfi Javed-Samantha: సమంత చూపిస్తే అందం.. నేను చూపిస్తే అసహ్యమా.. శృంగార తార షాకింగ్ కామెంట్స్..
Viral Video: భార్య శవంతో 21 ఏళ్లుగా సహాజీవనం.. చివరకు..! వీడియో చుస్తే హృదయం కదలాల్సిందే..!
Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..