Viral Video: కుక్క ‘హై జంప్‌’కు వీడియో వైరల్.. ఒలింపిక్స్‌కు పంపమంటున్న నెటిజన్లు..

కుక్కలు ఏ విషయాన్ని అయినా సరే చాలా త్వరగా నేర్చుకుంటాయి. వివిధ రకాల పనులలో నైపుణ్యం కలిగి ఉంటాయి. ప్రస్తుతం ఓ కుక్క వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో లో కుక్క నైపుణ్యం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.

Viral Video: కుక్క 'హై జంప్‌'కు వీడియో వైరల్.. ఒలింపిక్స్‌కు పంపమంటున్న నెటిజన్లు..
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: May 15, 2022 | 8:56 PM

Viral Video: ప్రపంచంలోని పెంపుడు జంతువులు కుక్కలు, పిల్లులు ఇలా ఎన్నో ఉన్నాయి. కానీ ఎక్కువ మంది ఇష్టంగా పెంచుకునే జంతువుల్లో ప్రధానమైనవి పెంపుడు కుక్కలు. ఇవి ఎక్కువగా ప్రతి ఇళ్లలో కనిపిస్తాయి. వాస్తవానికి, ప్రజలు కూడా ఈ జంతువును పెంచడానికి ఇష్టపడతారు. ఎందుకంటే అవి చాలా నమ్మకమైనవి. అవగాహన కలిగి ఉంటాయి. యజమాని పట్ల విశ్వాసం విధేయత విషయంలో మరే ఇతర జంతువులు కుక్కల ముందు నిలబడదు. పెంపుడు కుక్కలు తమ యజమాని ప్రాణాలను కాపాడేందుకు తమ ప్రాణాలను త్యాగం చేసే ఇలాంటి సందర్భాలను మీరు చాలా విన్నారు లేదా చూసి ఉంటారు. అంతేకాదు.. ఈ కుక్కలు అతి పెద్ద విలక్షణాన్ని సొంతం చేసుకున్నాయి. అది ఏమిటంటే.. కుక్కలు ఏ విషయాన్ని అయినా సరే చాలా త్వరగా నేర్చుకుంటాయి. వివిధ రకాల పనులలో నైపుణ్యం కలిగి ఉంటాయి. ప్రస్తుతం ఓ కుక్క వీడియో సోషల్ మీడియాలో( Social Media) వైరల్ అవుతోంది. ఆ వీడియో లో కుక్క నైపుణ్యం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.

ఈ వీడియోలో కుక్క జంప్ చేయడం కనిపిస్తుంది. ఈ ఫీట్ సాధారణ మనుషులు చేయడమే చాలా కష్టం. సోషల్ మీడియాలో ఇలాంటి రేస్‌కి సంబంధించిన అనేక వీడియోలు మీరు చాలానే చూసి ఉంటారు. అందులో ఆటగాళ్లు ‘హైజంప్’ చేస్తూ రేసులో పరుగెత్తుతూ ఉంటారు. అయితే ఈ వీడియోలో ఉన్న కుక్క రేసు పాల్గొనలేదు. కుక్క ఓ రేంజ్ లో  హైజంప్ చేస్తుంది. ఒక కుక్క ఇంట్లోకి ప్రవేశించడానికి ఒక ఎత్తులో ఉన్న తలుపు మీదకు దూకి ఇంట్లోకి ప్రవేశించింది. దాని వెనుక రెండు కుక్కలు వచ్చాయి.. అయితే అవి గేట్ దూక లేకపోవడంతో.. బయట ఉండిపోయాయి.. దీంతో ఇంట్లోకి వచ్చిన కుక్క.. వెనక్కి గెట్ దూకి ఆ కుక్కల దగ్గరకు ఈజీగా వెల్లింది.  ప్రస్తుతం ఈ వీడియో ఓ రేంజ్లో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇవి కూడా చదవండి

ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో pegadapets.official అనే IDతో షేర్ చేయబడింది.  ఇప్పటివరకు 23 లక్షల వ్యూస్, 16. లక్షల మంది ప్రజలు లైక్ చేసారు.  ఒక వినియోగదారుడు ఈ కుక్క చేసినట్లు తన కుక్క చేయలేదని చెప్పాడు. మరొకరు ఈ కుక్కను ఒలింపిక్స్‌కు పంపమని ఫన్నీ సలహా ఇచ్చారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..