Two Heads Snake: ఓరి మై గాడ్.. ఈ అరుదైన రెండు తలల పాము జీవితకాలం తెలిస్తే షాక్..
కొన్ని పాములు విచిత్రంగా ఉంటాయి. అవి సాధారణంగా కనిపిస్తాయి. అటువంటి పాముల్లో ఒకటి రెండు ముఖాల పాము. తాజాగా రెండు తలల పాము గురించి చాలా చర్చ జరుగుతోంది. దీని వయస్సు ప్రస్తుతం అందిరికీ షాక్ ఇస్తోంది.
Two Heads Snake: ప్రపంచంలో వివిధ రకాల పాములు కనిపిస్తాయి. వాటిలో కొన్నిపాముల గురించి మనకు తెలుసు.. కొన్నిటి గురించి తెలియదు. ఐయితే పాములు సాధారణంగా విషపూరితమైనవి.. ప్రమాదకరమైనవిగా పరిగణించబడతాయి. అయితే అన్ని పాములు విషపూరితమైనవి కావు. నల్లతాచు, కట్లపాము వంటివి మొదలైన పాములు విషపూరితమైనవి. వీటిని అత్యంత ప్రమాదకరమైన విషపూరిత పాముగా పరిగణిస్తారు. ఈ విషపూరితమైన పాము వేస్తే… ఒక వ్యక్తి ఎక్కువ కాలం జీవించలేడు. అయితే కొన్ని పాములు విచిత్రంగా ఉంటాయి. అవి సాధారణంగా కనిపిస్తాయి. అటువంటి పాముల్లో ఒకటి రెండు ముఖాల పాము. తాజాగా రెండు తలల పాము గురించి చాలా చర్చ జరుగుతోంది. దీని వయస్సు ప్రస్తుతం అందిరికీ షాక్ ఇస్తోంది.
వాస్తవానికి.. రెండు తలల పాములు చాలా అరుదు. ఈ పాములు సాధారణంగా ఎక్కువ కాలం జీవించవు. అయితే ఇటీవల ఒక బ్లాక్ రాట్ స్నేక్ 2-4 సంవత్సరాలు కాదు ఏకంగా 17 సంవత్సరాల వయస్సు ఉన్నట్లు కనుగొన్నారు. ఈ రెండు తలల బ్లాక్ రాట్ పాము ఇన్ని సంవత్సరాలుగా సజీవంగా ఉంది. ఈ పాము ఎటువంటి సమస్య లేకుండా ఆరోగ్యంగా జీవిస్తోంది.
5 అడుగుల పొడవు: మిర్రర్ నివేదిక ప్రకారం.. 2005లో, ఒక అమెరికన్ బాలుడు మిస్సౌరీలోని డెల్టా నగరంలో ఈ అరుదైన రెండు ముఖాల పామును కనుగొన్నాడు. తర్వాత ఈ పాముని కేప్ గిరార్డో కన్జర్వేషన్ నేచర్ సెంటర్‌కు తీసుకెళ్లాడు. అప్పటి నుండి ఆ పాము అక్కడ నివసిస్తుంది. ఈ పాము ఇప్పుడు ఐదు అడుగుల పొడవు ఉంది.
ఈ పాము లక్షల్లో ఒకటి: బ్రిటీష్ హెర్పెటోలాజికల్ సొసైటీ కౌన్సిల్ సభ్యుడు, పాములపై నిపుణుడు స్టీవ్ అలెన్ మాట్లాడుతూ.. ఈ రెండు ముఖాలు ఉన్న పాము మిలియన్‌లో ఒకటి అని చాలా అరుదుగా కనిపిస్తాయని చెప్పారు. ఇవి జీవించాలంటే.. రెండు తలల పాముకు.. రెండు నోటి నుంచి ఆహారం ఇవ్వాలి. లేకుంటే అవి ఎక్కువ కాలం జీవించలేవు. అడవిలో నివసించే రెండు ముఖాల పాములు ఆహారం అందక పోవడంతో ఎక్కువ కాలం జీవించవని చెప్పారు.